YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

భయం గుప్పిట్లో హుజూరాబాద్ ఈటల రాజేందర్

భయం గుప్పిట్లో హుజూరాబాద్ ఈటల రాజేందర్

భయం గుప్పిట్లో హుజూరాబాద్
ఈటల రాజేందర్
హైదరాబాద్
వేలమంది అరెస్టులతో హుజూరాబాద్ భయం గుప్పిట్లో ఉంది.   పోలీస్ స్టేషన్ లు, స్కూల్స్ సరిపోవడం లేదు.   ప్రభుత్వ డబ్బులతో కెసిఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. .  వాసాలమర్రి లో ఇప్పటికే ప్రారంబించబడిన దళితబంధు కి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు?  ఎవడి సొమ్మని ఖర్చు చేస్తున్నారు.  హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే హుజూరాబాద్ లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి షరతులు లేకుండా 10 లక్షల రూపాయలు అందించాలి.  హుజూరాబాద్ నియోజక వర్గంలో ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వారిని ఇక్కడికి బస్సులు పెట్టి తరలిస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దళితబంధు కింద పది లక్షల రూపాయల అందించాలని డిమాండ్ చేశారు. అది కూడా కలెక్టర్, అధికారులు, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ లేకుండా ఖర్చు పెట్టుకొనే స్వేచ్చ కలిపించాలని కోరారు. హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ని నమ్మే పరిస్థితుల్లో లేరు, ప్రజలు వస్తారో రారో అనే భయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు బస్సులు పెట్టి టిఆర్ఎస్ కార్యకర్తలను మీటింగ్ కు తరలిస్తున్నారని అన్నారు. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరికి కూడా   బస్సులు పంపి జనాన్ని తరలిస్తున్నారు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఏంటో  అర్దం అవుతుంది అని అన్నారు. మీటింగ్ జరుగుతున్న ఊరికి కూడా బస్సులు పెట్టి జనాన్ని తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ చేరుకుందని అన్నారు. అసలు ఇది ప్రజల మీటింగ్ కాదు అని ఆయన అన్నారు. మీటింగ్ కి తరలించే భాద్యత టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్స్, వీఆర్వోలు, వీఆర్యేలు లు వేలామందికి అప్పగించారు. వీరితో పాటు 10 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టారు. వీరితోనే సభా ప్రాంగణం నిండి పోతుందేమో అని అన్నారు.

Related Posts