YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మొక్కలు నాటేందుకు నాసి రకం మొరం.. సారవంతమైన నాణ్యమైన ఎర్రటి మట్టికి బదులు గుట్ట బోరు మొరం వినియోగం

మొక్కలు నాటేందుకు నాసి రకం మొరం.. సారవంతమైన నాణ్యమైన ఎర్రటి మట్టికి బదులు గుట్ట బోరు మొరం వినియోగం

మొక్కలు నాటేందుకు నాసి రకం మొరం..
సారవంతమైన నాణ్యమైన ఎర్రటి మట్టికి బదులు గుట్ట బోరు మొరం వినియోగం
నాసి రకం పనులపై పలువురు విమర్శలు
జగిత్యాల ఆగస్టు 17
జగిత్యాల నూతన కలెక్టరేట్ భవనం ఎదుట రోడ్డులో మొక్కలు నాటేందుకు గుట్ట బోరు మొరం వినియోగించడం మంగళవారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కలెక్టరేట్ ను పరిశీలించి జిల్లా కలెక్టర్ రోడ్డులో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీనితోనే గుత్తాదారు రోడ్డుపై మొక్కలు నాటే చర్యలు త్వరితగతిన చేపట్టారు. అయితే మొక్కలు నాటేందుకు సదరు గుత్తాదారు రెడ్ సాయిల్ వినియోగించకుండా గుట్ట మొరం వేయడం విమర్శలకు తావిస్తోంది.
మొక్కలు త్వరగా, ఏపుగా పెరగాలంటే సారవంతమైన నాణ్యమైన ఎర్రటి మట్టితో పాటు వర్మికంపోస్టు, పశు పేడను కలిపి మొక్కలు పెంచేందుకు వినియోగించాలి. కానీ వాటిని తయారు చేయాలంటే అధిక ఖర్చుతో కూడుకున్నది కావడంతో నాణ్యమైన మట్టిని వదిలి మొరం వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ భవనం ఎదుటనే గుత్తదారు నాసి రకం పనులు చేస్తున్నారని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
గతంలో జగిత్యాల పట్టణంలోని కరీంనగర్, నిజామాబాద్ రోడ్డులో డివైడర్ లో మొక్కల పెంపకంకు మొరం వాడడం, తక్కువ ఎత్తులో నిర్మించారని, గుత్తదారు, సంబంధించిన శాఖ వర్క్ క్వాలిటీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పనుల నిర్వహణలో అధికారులు, సైట్ సూపర్ వైజర్లు పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నాసిరకంగా చేపడుతున్నారని కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Related Posts