YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తిరుమల
మొదటిసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్వామిని దర్శించుకోవడం కోసం తిరుమలకు వచ్చానని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు టీటీడీ అధికారులు ఆలయం ముందు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించిగా, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తీర్థప్రసాదాలు అందించారు.  అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిందిగా భగవంతుని ప్రార్థించడం జరిగింది. దేశంలోని ప్రజలంతా వివిధ ప్రభుత్వాలకు సహకరించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని, శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారు మానవాళిని కనికరించి ప్రపంచాన్ని అభివృద్ది చేసే దిశగా ఆశీస్సులు అందించాలని కోరానని తెలిపారు.గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి తల్లి  వకుళామాత దేవాలయ నిర్మాణానికి టిటిడి కమిటీ పూనుకోవడం సంతోషకరమని.గతంలో స్వయంగా నేను కూడా దేవాలయ నిర్మాణం చేపట్టాలని అనేక సంవత్సరాలుగా టిటిడిని కోరడం జరిగిందని..ఆ ఆలయాన్ని ద్వంశం కాకుండా అడ్డుకున్నట్లు గుర్తుచేశారు..కాని ప్రస్తుత టిటిడి కార్యవర్గం వకుళమాత ఆలయని ఓ అద్భుతమైన దేవాలయంగా నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్త పరిచారు,ఈ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఏద్చేగా జరుగుతుందని, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎర్రచందనాని అక్రమంగా నరికి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని..ఎర్రచందనంను అక్రమరవాణా అరికట్టాలని గతంలో నేను అడవిలో ఒక రోజు అంతా పాదయాత్ర చేసి పరిశీలించమని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయం మాఫియా కాబట్టి,ఇతర దేశాల నేరస్తులతో సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునే విధంగా నా వంతు క్రుషి చేస్తానని అలాగే ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మీడియా ముఖంగా తెలిపారు..మొదటి సారిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని..దేశం ఎదుర్కొంటున్న జాతీయ,అంతర్జాతీయ సమస్యలు గానీ పరిష్కారం కోసం ప్రధాని మోదీకి స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.. కేంద్ర మంత్రి తోపాటు ఏపి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సియం రమేష్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్థిక మంత్రి బుగ్గన స్వామివారిని దర్శించుకున్నారు.

Related Posts