YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద టూరిజం కేంద్రాల అభివృద్ధి:  కిషన్‌రెడ్డి

సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద టూరిజం కేంద్రాల అభివృద్ధి:  కిషన్‌రెడ్డి

సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద టూరిజం కేంద్రాల అభివృద్ధి:  కిషన్‌రెడ్డి
విజయవాడ ఆగష్టు 19
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద అభివృద్ధి చేస్తా మని  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శనానికి వచ్చిన సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ‘దేశ సంస్కృతీసాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారు. వరంగల్‌లోని వీరభద్ర ఆలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించింది. రానున్న రోజుల్లో ఏపీలో 126 కేంద్రాలున్నాయి. వాటిని  రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి అభివృద్ధి చేస్తాం పర్యాటక శాఖ చాలా ఛాలెంజ్‌తో జూడుకుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం  దెబ్బతింది’ అని తెలిపారు.జనవరి 1వ తేదీ నాటికి కోవిడ్ తగ్గగానే పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను  అందరికీ తెలిపేలా కార్యక్రమాలు చేపడతాం. పర్యాటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తా. ఏపీ, తెలంగాణ మోదీకి రెండు కళ్లులాంటివి. సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారు. తెలుగువాడికి కేంద్ర‌మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారు. దుర్మమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తా’ అని తెలిపారు.

Related Posts