YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాకాణి చేతులమీదుగా విభిన్న ప్రతిభావంతులకు సెల్ ఫోన్ల పంపిణీ

కాకాణి చేతులమీదుగా విభిన్న ప్రతిభావంతులకు సెల్ ఫోన్ల పంపిణీ

కాకాణి చేతులమీదుగా విభిన్న ప్రతిభావంతులకు సెల్ ఫోన్ల పంపిణీ
నెల్లూరు
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సెల్ ఫోన్ లు అందజేశారు. ఈ కార్యక్రమం హలో  నెల్లూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయక సంస్థ సహాయక సంచాలకులు  నాగరాజ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయక సంస్థ ద్వారా మూగ మరియు చెవుడు 100 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు టచ్ ఫోన్లు అందజేయడం సంతోషకర విషయం అన్నారు.
టచ్ ఫోన్ కావాలనుకున్న వారు వంద శాతం వైకల్యం కలిగిన బదిర దివ్యాంగులు ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయక సంస్థ వెబ్ సైట్ నందు నమోదు చేసుకుంటే, అర్హత కలిగిన  వారందరికీ టచ్ ఫోన్లు అందజేస్తామని పేర్కొన్నారు.

Related Posts