YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హామీ లో పెండింగ్ బకాయిలు వేతనాలు చెల్లించాలి ఆవుల శేఖర్

ఉపాధి హామీ లో పెండింగ్ బకాయిలు వేతనాలు చెల్లించాలి ఆవుల శేఖర్

 ఉపాధి హామీ లో పెండింగ్ బకాయిలు వేతనాలు చెల్లించాలి
ఆవుల శేఖర్
డోన్
ఉపాధి హామీ లో పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి అనీ ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంగమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవుల శేఖర్ డిమాండ్ చేస్తున్నారు, స్థానిక డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో సచివాలయం వద్ద ధర్నా ధర్నా కార్యక్రమంలో అవుల శేఖర్ పాల్గొన్నారు.   ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మికసంఘం బికెయంయూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో ఉడుములపాడు గ్రామ సచివాలయం దగ్గర ధర్నా కార్యక్రమం తాలూకా అధ్యక్షులు, వరదరాజులు, కార్యదర్శి నారాయణ నాయకత్వన జరిగింది. ఈ ధర్నా ముఖ్య అతిధి గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీలో పెండింగ్ బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలల్లో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వాలని, కోనేరురంగారావు భూ కమిటీ సిఫార్సులను నవరత్నాలు చేర్చి భూమిలేని పేదలకు 2 ఎకరాలు భూమి ఇవ్వాలని, రేషన్ కార్డు లో ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు ఎటువంటి నిబంధనలు పెట్టకుండా అమలు చేయాలని, వ్యవసాయంలో యంత్రాలను నియంత్రించి వ్యవసాయ కూలిలతో పనులు చేయించుకునేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వై యస్ జగన్ అధికారం లోకి వచ్చే ముందు నవరత్నాలు పెట్టుకొని ప్రచారం చేసి అధికారం లోకి వచ్చాడని, సంక్షేమ పథకాలు అమలు మంచిదే నని వాటిని వ్యవసాయ కార్మిక సంఘం స్వాగతిస్తున్నదని అన్నారు. కాని ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పక్కా గృహాలు 4 లక్ష లతో కట్టించి ఇవ్వాలని ఆయన కోరారు. ఉపాధి లో పెండింగ్ లో వున్న బకాయి వేతనాలు వెంటనే ఉపాధి కూలీలకు ఇవ్వాలన్నారు.కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను వెంటనే నవరత్నాల్లో చేర్చి భూమి లేని ప్రతి పేదకుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వాలని, రాష్ట్రము లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని అన్నారు. రేషన్ కార్డు ఆధారంగా ఒక్కరికే పెన్షన్ అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవా లన్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అందరికి అందాలని అనవసరమైన నిబంధన లు పెట్టవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కాలనీల్లో కనీసవసతులు ఏర్పాటు చేసి పేదలను ఆడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏ ఐ వై యఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, డోన్ నియోజకవర్గ సి పి ఐ కార్యదర్శి రంగనాయుడు, ఏ ఐ వై యఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిశేఖర్,బొంతిరాళ్ల సర్పంచ్, న్యాయవాది రవిమోహన్, ఉడుములపాడు గ్రామ కార్యదర్శి మధు, మద్దయ్య, తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల ఉపాధి కూలీలు, పేదలు పాల్గొన్నారు.అనంతరం సచివాలయం కార్యదర్శి కి మెమోరాండం సమర్పించారు.

Related Posts