YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడ్–ఇన్–ఇండియా క్రిప్టో ఎక్స్ చేంజ్ ‘బిట్స్జ్’ ప్రారంభం

మేడ్–ఇన్–ఇండియా క్రిప్టో ఎక్స్ చేంజ్ ‘బిట్స్జ్’ ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 11
మేడ్–ఇన్–ఇండియా క్రిప్టో ఎక్స్ చేంజ్ ‘బిట్స్ ను ప్రముఖ తార నిధి అగర్వాల్ ప్రారంబించారు. హైదరాబాద్  జరిగిన కార్యక్రమంలో మేడ్ ఇన్ ఇండియా క్రిప్టో ఎక్స్ చేంజ్ ‘బిట్స్జ్’ను నిధి అగర్వాల్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖులతో పాటుగా ప్రఖ్యాత నటి నిధి అగర్వాల్ పాల్గొన్నారు.నూతన క్రిప్టో ఎక్స్ చేంజ్ వేదిక ప్రారంభం గురించి ‘బిట్స్జ్’ వ్యవస్థాపకులు నవీన్ కుమార్ వివరించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ‘‘ఎంతో మంది యువతీ యువకులు, క్రిప్టో ఔత్సాహికులు ‘బిట్స్జ్’ పై ఆసక్తి కనబర్చడం నిజంగా ఎంతో ఆనందాన్ని అందిస్తోంది’’ అని అన్నారు. ‘బిట్స్జ్’ రూపకల్పన ఉద్దేశం, తన అనుభవం గురించి నవీన్ ఈ సందర్భంగా వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దీన్ని రూపొందించేందుకు తాను, తన జట్టు సభ్యులు చేసిన కృషిని ఆయన వివరించారు.డిజిటల్ అసెట్ మేనేజ్ మెంట్ అగ్రగామి ఫైర్ బ్లాక్స్ తో బిట్స్జ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని రకాల వాలెట్స్ పై అది వినియోగదారులకు బీమా కల్పిస్తుంది. దాంతో పాటుగా  బిట్స్జ్, ఈ ప్లాట్ ఫామ్ పై 30 M వరకు  లావాదేవీలు చేసేందుకు వీలు కల్పించే, శరవేగంగా వృద్ధి చెందే ఎక్స్ చేంజ్ కానుంది.‘మరొక్క అవకాశం తీసుకోవడం మీ జీవితాలను గణనీయంగా మార్చివేస్తుంది’ అని నవీన్ అన్నారు. సరికొత్త తరం వ్యాపారులు లేదా గతంలో ఎక్స్ చేంజ్ లావాదేవీల్లో దెబ్బ తిన్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బిట్స్జ్ ద్వారా క్రిప్టోలో ఒక అవకాశం తీసుకోవాలని, క్రిప్టో భవిష్యత్ లో భాగం కావాలని సూచించారు.క్రిప్టో ఎక్స్ చేంజ్ లలో ఒకటైన బిట్స్జ్ తన ప్రత్యేకతల కారణంగా మార్కెట్ లో సంచలనం కలిగించింది. సంస్థ రిజిస్ట్రేషన్ జరిగిన నాటి నుంచి దీనిపై అంచనాలు ఎంతగానో పెరిగాయి. బిట్స్జ్ మొదటి నుంచి కూడా క్రిప్టో ఇన్వెస్టర్లకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూవచ్చింది.

Related Posts