YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రపంచంలోనే పెద్ద విమానశ్రయం

ప్రపంచంలోనే పెద్ద విమానశ్రయం

న్యూఢిల్లీ, నవంబర్ 25,
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జెవార్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ప్ర‌ధాని మోదీ ఇవాళ శంకుస్థాప‌న చేశారు. ఉత్త‌ర భార‌త దేశానికి నోయిడా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వ్యూహాత్మ‌కంగా కీల‌కంగా మార‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నార్త‌ర్న్ ఇండియాకు లాజిస్టిక్స్ కేంద్రంగా ప‌నిచేస్తుంద‌న్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్‌, వెస్ట్ యూపీ ప్ర‌జ‌ల‌కు ఈ ప్రాజెక్టుతో ల‌బ్ధి చేకూర‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాలు యూపీని విస్మ‌రించాయ‌న్నారు. బ‌హుళ‌జాతి కంపెనీలు త‌మ పెట్టుబ‌డుల‌కు యూపీనీ కేంద్రంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్క‌డ అయిదు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు ఉంటాయ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు యూపీని చీక‌ట్లోకి నెట్టేశాయ‌ని, ఇప్పుడు యూపీకి అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌స్తోంద‌న్నారు. ఏడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఈ రాష్ట్రానికి మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. నోయిడ్ విమానాశ్ర‌యం వేలాది మంది ప‌శ్చిమ యూపీ ప్ర‌జ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో, దాదాపు 8,914 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుండి ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు
4 దశల్లో నిర్మాణం
నాలుగు దశల్లో నిర్మాణం..
ప్రారంభంలో, జెవార్ విమానాశ్రయంలో రెండు ఎయిర్‌స్ట్రిప్‌లు పనిచేస్తాయి. ఈ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టును జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు. మొత్తం నాలుగు దశలు పూర్తయిన తర్వాత, ఈ సామర్థ్యం 70 మిలియన్ల ప్రయాణికులకు పెరుగుతుంది. ఈ విమానాశ్రయాన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) అభివృద్ధి చేస్తుంది. ఇందులో జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ 100% వాటాను కలిగి ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో జెవార్ విమానాశ్రయం రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. ఇది సిద్ధమైతే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రస్తుతం ఉన్న ప్రయాణీకుల భారం తగ్గనుంది.ఇది కాకుండా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, అలీగఢ్, ఆగ్రా, ఫరీదాబాద్, ఇతర పరిసర జిల్లాల నివాసితులు కూడా జేవార్ విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు ప్రయోజనం పొందుతారు. జెవార్ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి ప్రవేశ ద్వారంగా మారుతుందని, ఉత్తరప్రదేశ్ రూపురేఖలను మారుస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
జేవార్ విమానాశ్రయం నిర్మాణం ఇలా..
జేవార్ విమానాశ్రయం 5845 హెక్టార్ల భూమిలో నిర్మిస్తారు. అయితే మొదటి దశలో 1334 హెక్టార్ల స్థలంలో దీన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో ఇక్కడ రెండు ప్యాసింజర్ టెర్మినళ్లు, రెండు రన్‌వేలు నిర్మించనున్నారు. తర్వాత ఇక్కడ మొత్తం ఐదు రన్‌వేలను నిర్మించనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరిగేకొద్దీ, మరిన్ని రన్‌వేలను నిర్మించవచ్చు. విమానాశ్రయం ప్రస్తుతం ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 2050 నాటికి 200 మిలియన్లకు పెరుగుతుందని అంచనా.జేవార్ ఎయిర్‌పోర్ట్‌లో మొదటి సంవత్సరంలో 40 లక్షల మంది రాకపోకలు..అంచనాల ప్రకారం ఈ విమానాశ్రయానికి మొదటి సంవత్సరంలో దాదాపు 40 లక్షల మంది ప్రయాణీకులు ఉంటారు. 2025-26లో ప్రయాణికుల సంఖ్య 70 లక్షల వరకు ఉండవచ్చు. మొదటి ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుందని అంచనా. 2044 నాటికి ప్రయాణికుల సంఖ్య దాదాపు 80 మిలియన్లుగా ఉంటుందని అంచనా.మొదటి సంవత్సరంలో జెవార్ విమానాశ్రయం నుండి 9 విమానాలు(8 దేశీయ..1 అంతర్జాతీయ) విమానాలు ప్రారంభిస్తారు. అయితే సామర్థ్యం పూర్తయిన తర్వాత 27-27 దేశీయ-అంతర్జాతీయ విమానాలు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఎగురతాయి. ఈ విమానాశ్రయం కనీసం 2030 నాటికి ఢిల్లీలా అంతర్జాతీయ రూపాన్ని సంతరించుకోగలదు

Related Posts