YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అరుణాచల్ ప్రతి ఇద్దరిలో ఒకరు....మద్యపాన ప్రియులు

అరుణాచల్ ప్రతి ఇద్దరిలో ఒకరు....మద్యపాన ప్రియులు

ఇటానగర్, నవంబర్ 30,
ప్రస్తుతమున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మద్యానికి బానిసవుతున్నారు. చిన్న నుంచి పెద్దల వరకు మద్యం లేనిది ఉండటం లేదు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. ఆరోగ్య సర్వే-5 డేటాను విడుదల చేసింది. ఈ సర్వేలో అధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాను బయటపడింది. లక్షలాదిమందిపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మద్యం సేవించే పురుషుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ అని తేలింది. ఈ సర్వేలో మద్యం సేవించడంపై 15 ఏళ్లుపైబడిన వారి నుంచి పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టింది జాతీయ ఆరోగ్య సంస్థ. ఇందులో దేశంలో 18.8 శాతం మంది పురుషులు, 1.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమైంది. అయితే రాష్ట్రాల వారీగా గణాంకాలు వేరేగా ఉన్నాయి. జనాభా ప్రకారం.. అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముందుంది. అతి తక్కువ మద్యం వినియోగించేది లక్షద్వీప్‌. ఉంది.అయితే నిషేధం ఉన్న రాష్ట్రాల్లో మద్యం కూడా వినియోగిస్తారు. బీహార్ మరియు గుజరాత్‌లలో, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాన్ని అమలు విధించాయి. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ మద్యం సేవిస్తారు. బీహార్‌లో 15.5 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తుండగా, గుజరాత్‌లో 5.8 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే ద్వారా తేలింది.అరుణాచల్‌లో అత్యధికంగా మద్యపానంలో 52.7 శాతం పురుషులు, 24.2 శాతం మహిళలు ఉన్నారు. తెలంగాణలో 43.3 శాతం పురుషులు, 6.7 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇక మరోవైపు సిక్కిం రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి వరుసగా 39.8 మరియు 16.2 శాతం ఉంది.ఇక అండమాన్ నికోబార్‌లో 39.1 శాతం మంది పురుషులు, 5 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మణిపూర్‌లో 37.5 శాతం మంది పురుషులు, 0.9 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో మద్యం సేవించే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి వరుసగా 13.9 మరియు 0.4 శాతంగా ఉంది.అలాగే రాజస్థాన్‌లో 11 శాతం మంది పురుషులు, 0.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 8.8 శాతం మంది పురుషులు, 0.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో, ఈ సంఖ్య లక్షద్వీప్‌లో అత్యల్పంగా ఉంది. ఇక్కడ మద్యం సేవించే పురుషులు, స్త్రీలలో వరసగా 0.4 శాతం, 0.3 శాతం ఉన్నట్లు జాతీయ సర్వే తేల్చింది.

Related Posts