YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారం రోజులు డెడ్ లైన్ అప్పుల కోసం తిప్పలు

వారం రోజులు డెడ్ లైన్ అప్పుల కోసం తిప్పలు

విజయవాడ, డిసెంబర్ 15,
రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నురచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నిసార్లు గడువు ఇచ్చినా ఫలితం లేకవడంతో ఇక న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించాయి. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్టసీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని తేల్చిచెప్పాయి. దీరతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు బకాయిలకు చెల్లించాల్సిన నిధుల కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఆర్థికశాఖపైనా ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు.రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం గత కొన్నేళ్లుగా జెన్‌కో, పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు కేంద్ర సంస్థల నురచి రుణాలు తీసుకున్నాయి. అయితే సకాలంలో వాటి కిస్తీలు చెల్లించకపోవడంతో చాలా మొత్తం ఓవర్‌డ్యూస్‌గానే కొనసాగుతున్నాయి. చివరికి వాటిల్లో కొన్ని ఎన్‌పిఎ (నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌)గా కూడా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికారులు కొద్ది రోజుల క్రితం ఆర్‌ఇసి, పిఎఫ్‌సి అధికారులతో చర్చించి వాయిదాల పద్ధతిలో బకాయిలు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయినప్పటికీ నిర్దిష్ట సమయంలోగా వాయిదాలు చెల్లించకపోవడంతో మరోసారి రాష్ట్ర జెన్‌కో అధికారులకు లేఖలు రాసాయి. ఈ సందర్భంగా డిసెంబర్‌ 24 వరకు గడువు విధించాయి. ఈ లోగా చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలకు దిగుతామని తేల్చిచెప్పాయి. ఇప్పటికే రూ.17,781 కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. ఇందులో బకాయిలు కోసం ఈ ఏడాది జూలై 21 నురచి ఆరు సార్లు డిమాండ్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అభియోగం. చివరకు ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా నవంబర్‌ 29న రూ.354.62 కోట్లు, 30వ తేదీన రూ.328.45 కోట్లు తమకు చెల్లించినట్లు వివరించింది. డిసెంబర్‌ ఒకటి నాటికి ఇంకా తమకు రూ.1162.86 కోట్లు బకాయి రావాల్సి ఉందని పిఎఫ్‌సి పేర్కొంది. ఆర్‌ఇసి కూడా ఇదే హెచ్చరికలు చేసింది. తాము రూ.17,184 కోట్ల వరకు రుణాలు ఇచ్చామని, అవి ఓవర్‌డ్యూస్‌గానే కాకుండా ఎన్‌పిఎలోకి కూడా చేరుతున్నాయని తన లేఖలో పేర్కొంది. నవంబర్‌ 30న రూ.310.42 కోట్లు, 29న రూ.35 కోట్లు జమయ్యాయని, మిగిలిన రూ.141.97 కోట్లు ఇంకా రాలేదని పేర్కొంది. ఈ మొత్తం 24వ తేదీలోగా చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.కాగా గత నెలాఖరులో పిఎఫ్‌సి, ఆర్‌ఇసి అధికారులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి జెన్‌కో అధికారులతోపాటు నేరుగా సిఎస్‌, సిఎంలతో కూడా చర్చలు జరిపారు. అనంతరం బకాయిల కోసం రెండు సంస్థలూ ఒకేరోజు లేఖలు రాయడం, ఒకే అంశాలతో రాయడం, ఒకే తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించడం గమనార్హం. లేఖలోని వాక్యాలు కూడా ఒకేవిధంగా ఉన్నాయి.మళ్లీ ఎన్‌పిఎలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉండడం, కేంద్ర సంస్థలు న్యాయ చర్యలకు సిద్ధమవుతుండడంతో పాత బకాయిల చెల్లింపులపై జెన్‌కో, పవర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణమే జెన్‌కోకు రూ.1294 కోట్లు, పవర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు రూ.1366 కోట్లు కలిపి మొత్తం రూ.2660 కోట్లు కేటాయించాలని జెన్‌కో అధికారులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఆర్ధికశాఖకు కూడా వివరించనున్నారని సమాచారం.

Related Posts