YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి.. పరిష్కరిస్తా!

మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి.. పరిష్కరిస్తా!

అమరావతి డిసెంబర్ 15,

మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి.. పరిష్కరిస్తా!    పార్టీ కోసం పనిచేసేవారికి ప్రతి ఒక్కరికీ ఈ సారి గుర్తింపు  కార్యకర్తలకు చంద్రబాబు భరోసా
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది? ``సార్ మీరు చెప్పినట్టు వింటాం.. పార్టీ కోసం పనిచేస్తాం.. మాకు టికెట్ ఇస్తారా?`` అని కొందరు.. ``సార్ గత ఎన్నికలకు ముందు మేం బాగానే పనిచేశాం.. అని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో మాత్రం మాకు ప్రాధాన్యం ఇవ్వలేదు`` అని మరికొందరు. ``గత ప్రభుత్వంలోనూ మాకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇది న్యాయమేనా సార్!`` అని ఇంకొందరు.. ఇలా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల నుంచి టీడీపీ అధినేతపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పార్టీ ఐ-టీడీపీ విభాగానికి నిత్యం వందల సంఖ్యలో పార్టీ నేతల నుంచి సందేశాలు వస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు స్వయంగా పార్టీ కార్యకర్తలు నేతలకు ఒక సూచన చేశారు. ``మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి.. పరిష్కరిస్తాను! కానీ పార్టీ కోసం పనిచేయండి. పార్టీ కోసం పనిచేసేవారికి ప్రతి ఒక్కరికీ ఈ సారి గుర్తింపు ఉంటుంది!`` అని భరోసా ఇచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి ఐటీడీపీ విభాగానికి తమ్ముళ్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు తాము పార్టీ కోసం.. ఎంతో కష్టపడి పనిచేశామని.. అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమను పక్కన పెట్టారని.. ఒక సామాజిక వర్గానికే న్యాయం చేశారని.. పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని.. వారు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
అదేసమయంలో పార్టీ కోసం తాము కృషి చేస్తున్నా.. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని.. కనీసం.. టికెట్ల విషయంలోనూ న్యాయం జరగడం లేదని.. వారసులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారని.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమకు ఇప్పుడు హామీ ఇస్తానంటే ఇప్పటి నుంచే పనిప్రారంభిస్తామని.. అంటున్నారట. దీంతో ఇప్పుడు ఈ విషయాలపై పార్టీ అధినేత చంద్రబాబు తలపట్టుకున్నారు. వీరిని సంతృప్తి పరిచేందుకు ఏం చేయాలనే అంశంపై ఆయన సీనియర్లతో తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కావడం.. తనశపథాన్ని నెగ్గించుకోవాల్సి ఉండడంతో కార్యకర్తలు చిన్నపాటి నేతలను ఆయన తనవైపు తిప్పుకోకపోతే.. కష్టమనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు.. ఇటీవల కాలంలో అందరినీ హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదని.. కొందరిని సస్పెండ్ చేశారు. అయితే.. ఈ చర్యలు వికటించే ప్రమాదం ఉందని.. సస్సెండ్ అయిన వారు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కూడా చంద్రబాబుకు ఉప్పందింది. తాము పార్టీకోసం పనిచేస్తే.. అధికారంలో ఉన్నప్పుడు.. కనీసం తమను పట్టించుకోలేదని .. ఇప్పుడు చిన్న తప్పు చేసినందుకుపార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని.. వారు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇటు ఉన్న నాయకులను సమర్ధించడంతోపాటు.. సస్పెండ్ అయిన వారి నుంచి ఎదురయ్యే వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకునేలా.. చంద్రబాబు ఏం చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఏం చేస్తారోచూడాలి.

Related Posts