YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొల్లేరులో పక్షుల సందడి

కొల్లేరులో పక్షుల సందడి

ఏలూరు, డిసెంబర్ 21,
ప్రతి ఏటా శీతాకాలంలో కొల్లేరు సరస్సు విదేశీ పక్షుల అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం పర్యాటకులతో సందడిగా మారింది.ప్రతి ఏటా శీతాకాలంలో కొల్లేరు సరస్సు విదేశీ పక్షుల అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం పర్యాటకులతో సందడిగా మారింది. విదేశాల నుంచి కొల్లేరు సరస్సుకు తరలివచ్చిన పెలికాన్ పక్షులను వీక్షించేందుకు కృష్ణా జిల్లాతో పాటు.. ఉభయగోదావరి జిల్లాల నుంచి అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు.ఆటపాక పక్షుల కేంద్రంలో యూరప్‌, సైబీరియా ప్రాంత అందమైన పక్షుల్లో ఉల్లము కురివి (కామన్‌ స్నిప్‌) ఒకటి. ఇది శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు ఏటా వచ్చి సంతానోత్పత్తి చేసుకుంటుంది. చిత్తడి నేలల్లో నీరు తక్కువగా ఉండి.. బురద ఉండే ప్రాంతంలో తూడులో గూడు ఏర్పాటు చేసుకుంటుంది. నాలుగు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంది. పిచ్చుక ఆకారంలో ఉండే ఈ పక్షి పసుపు, గోధుమ రంగులో రెక్కలపై తెల్లటి మచ్చలుంటాయి. ఈ పక్షి ముక్కు 6.4 సెం.మీ. వరకు పెరుగుతుంది.ఆటపాక పక్షుల కేంద్రం మంచి టూరిజం స్పాట్‌గా మారింది. ఇక్కడ పక్షుల పరిశీలనకు అనువుగా బర్డ్స్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ పక్షుల సంరక్షణ కేంద్రం కొల్లేరు మధ్యస్థంగా కైకలూరు అటవీ ప్రాంత పరిధిలో ఉంది. కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని తడినేలల్లో 673 కిలోమీటర్లలో ఈ సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది.

Related Posts