YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గోవాలో కాంగ్రెస్ వినూత్న ఆందోళన

గోవాలో కాంగ్రెస్ వినూత్న ఆందోళన

మా రాష్ట్రానికి సీఎం కావాలంటున్నారు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. పీసీసీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఆధ్వర్యంలో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బందోద్కర్ విగహ్రం దగ్గర ఆందోళన నిర్వహించారు. రాష్ట్రానికి ఫుల్‌టైమ్ సీఎంను నియమించాలని తొలి ముఖ్యమంత్రి బందోర్కర్‌ను ప్రార్థించామన్నారు గిరీష్. దీనిపై గవర్నర్ సహా అందరికి విజ్ఞ‌ప్తి చేసినా... ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అయినా దీనిపై స్పందించి... ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గోవా సీఎం మనోహర్ పారికర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లి... అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ముగ్గురు మంత్రులతో కూడిన అడ్వైజరీ కమిటీ పాలనపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిపైనే కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం లేకపోవడం వల్ల పాలన సరిగా సాగడం లేదంటూ ఆ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే వినూత్నంగా నిరసన చేపట్టింది. మరో వైపు అమెరికాలో తనకు అందిస్తున్న చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడుతోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు.తాను తీసుకుంటున్న చికిత్స మంచి ఫలితాలను అందిస్తోందని ఆయన వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రజలతో కలుస్తానని ప్రకటించారు.గత నెల మనోహర్‌ పారికర్‌ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లకముందు క్లోమ గ్రంథి ఇబ్బందులతో ఆయన ఫిబ్రవరి 15న ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఫిబ్రవరి 22న ఆయన్ను డిశ్చార్జి చేశారు. మార్చి 21న ముఖ్యమంత్రి చికిత్సకు స్పందిస్తున్నారని పారికర్‌ వ్యక్తిగత కార్యదర్శి రూపేశ్‌ కామత్‌ మీడియాకు వెల్లడించారు.

Related Posts