YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

క్రీడాకారుడిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

క్రీడాకారుడిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్
సౌత్ అమెరికా లోని బ్రెజిల్ లో జరుగనున్న 11వ  వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ - 2022 లో మన దేశం తరపున పాల్గోంటున్న హైదరాబాద్ నగరానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి క్రీడాకారుడిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...బ్రెజిల్ లో ఏప్రిల్ 20 నుండి 30 వ తేది వరకు జరుగనున్న 11వ వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ - 2022 లో మన దేశంతో పాటు 30 దేశాలకు చెందిన 150 మంది అడ్వెంచర్స్ పైలెట్లు పాల్గొంటున్నారు. వారిలో మన రాష్ట్రానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ ఉండటం గర్వకారణమని   పేర్కొన్నారు. ఈ అడ్వెంచర్స్ స్పోర్ట్స్, ఏరో స్పోర్ట్స్ లు యూరోపియన్ దేశాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచామన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రోత్సాహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాలైన లండన్, న్యూయార్క్, పారిస్, సిడ్నీ, మెల్బోర్న్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాల్లో ఏరో స్పోర్ట్స్, అడ్వెంచర్స్ స్పోర్ట్స్, టూరిజం లు పర్యాటకులను ఎంతో ఆకర్షించేందుకు దోహదం చేస్తున్నాయన్నారు.
పారా మోటోరింగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ లో భాగంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో నగరానికి బ్రాండింగ్ ను కల్పించేందుకు పారా మోటోరింగ్ ఏషియన్ ఛాంపియన్స్ షిప్ - 2022 ను హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టణాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించేందుకు  వరల్డ్ పారా మోటోరింగ్ అసోసియేషన్- స్విజర్లాండ్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ లు ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేశారని మంత్రి అన్నారు.

Related Posts