YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శివ నామస్మరణతో మారు మ్రోగుతున్న నల్లమల అడవి

శివ నామస్మరణతో మారు మ్రోగుతున్న నల్లమల అడవి

కర్నూలు
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తున్నారు . నల్లమల ప్రాంతం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి సమీపిస్తుండటంలో రాయలసీమ,కోస్తా,తెలంగాణ,కర్ణాటక ప్రాంతాల నుండి మహిళలు, వృద్ధులు,చిన్నారులు శ్రీశైలమల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని భక్తులంటున్నారు.నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే శివస్వాముల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి శివ స్వాములు పాదయాత్ర నడుచుకుంటూ వస్తున్నారు.  దేవస్థానం అధికారులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కాలినడకన వచ్చే నల్లమల నుండి వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు.  అలాగే పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు

Related Posts