YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

రష్యా ఆధీనంలోకి రెండో నగరం

రష్యా ఆధీనంలోకి రెండో నగరం

మాస్కో, మార్చి 4,
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అటార్నీ జనరల్ ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన ఏజీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు.రష్యాకు ఆఫర్లు ప్రకటించింది అమెరికా. యుద్ధం నిలిపివేస్తే ఆంక్షలు ఎత్తివేస్తామంటూ అమెరికా రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ విక్టోరియా నులాండ్ ప్రకటించారు.న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలితే యూరప్ మొత్తం నాశనమవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన విధ్వంసం వల్ల యూరప్ నాశనం కాకూడదని అన్నారు. జపోరిజ్జియాపై దాడి తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.  IAF C-17 విమానాలను భారత వైమానిక దళం అక్కడికి పంపించింది. గత రాత్రి, ఈ ఉదయం ఆపరేషన్ గంగా కింద హిండన్ ఎయిర్‌బేస్‌కు తిరిగి వచ్చాయి.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యాను కోరారు. ఉక్రెయిన్ న్యూక్లియర్ సైట్‌పై తక్షణ ప్రతిచర్యకు అనుమతి ఇవ్వండి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాంట్‌కు నష్టం వాటిల్లిన చోట వాటిని సరిచేసుకునేందుకు అనుమతించాలన్నారు.
ఉక్రెయిన్‌ ప్రజలను హెచ్చరించింది అక్కడి ప్రభుత్వం. రష్యా వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో అంతా బంకర్లలో తల దాచుకోవాలని సూచించింది. ఇప్పటికే ఒడెస్సా, బిలాసెర్‌క్వా, వొలిన్‌ఒబ్లాస్ట్‌ ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం యూరప్‌ అభద్రతలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్. యూరప్ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తున్నాడని అన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు బ్రిటన్ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని తాను డిమాండ్ చేస్తానని.. బ్రిటన్ తక్షణమే రష్యా సన్నిహిత మిత్రదేశాలతో ఈ సమస్యను తీసుకుంటుందని బ్రిటన్ ప్రధాని చెప్పారు.ఉక్రెయిన్‌లోని అణు కర్మాగారంలో కాల్పుల ఘటన తర్వాత బ్రిటన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యూరోప్‌లోని అతిపెద్ద జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ , పరిసర ప్రాంతాన్ని ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయమై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీవ్ర ప్రమాదాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, మేము పరిస్థితి గురించి ఉక్రెయిన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని .. అణు విద్యుత్ ప్లాంట్  పై షెల్లింగ్ నివేదికల గురించి కూడా తెలుసునని తెలిపింది.ఉక్రెయిన్‌లోని అణు రియాక్టర్లను ఢీకొంటే తీవ్ర ప్రమాదం తప్పదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది.  డైరెక్టర్-జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ ఉక్రేనియన్ ప్రధాన మంత్రి డెనిస్ శ్యాగల్ , ఉక్రేనియన్ న్యూక్లియర్ రెగ్యులేటర్ , ఆపరేటర్‌తో అణు విద్యుత్ ప్లాంట్‌లోని భయంకరమైన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.  కూడా బలప్రయోగాన్ని ఆపాలని రష్యా సైన్యానికి విజ్ఞప్తి చేసింది.యూరప్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ   ట్వీట్ చేసింది .  IAEA పరిస్థితి గురించి ఉక్రేనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అణు విద్యుత్ ప్లాంట్  పై షెల్లింగ్ లోని పరిస్థితిపై చర్చలు జరుపుతోంది. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన జపోరిజియా ఎన్‌పిపిపై రష్యా దళాలు అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ వివరాలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా వెల్లడించారు. ప్లాంట్ ఇప్పటికే మంటల్లో చిక్కుకుందని తెలిపారు. అది పేలినట్లయితే, అది చెర్నోబిల్ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని హెచ్చరించారు. కైవ్ నుంచి వస్తున్న విద్యార్థిపై కాల్పులు జరిపి.. తిరిగి కైవ్‌కు తీసుకెళ్లినట్లు తెలిసిందని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్. పోలాండ్‌ వేదికగా జరుగుతున్న ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి. అయితే అత్యంత వేగంగా భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖార్కివ్‌లో ఉక్రెయిన్ సైన్యం మూడు వేల మందికి పైగా భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, పుతిన్ చేసిన ఈ వాదనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ నుంచి భారతీయుల స్వదేశానికి మిషన్ కొనసాగుతోంది. అర్థరాత్రి, దాదాపు 700 మంది విద్యార్థులు వైమానిక దళం, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దేశానికి తిరిగి వచ్చారు. రేపు అంటే మార్చి 5 నాటికి మరో 15 వేల మంది పిల్లలను తరలించే యోచనలో ఉంది.ఖర్కీవ్ నుంచి మరో కీలక రేవు పట్టణం మారిపోల్‌‌పై దాడిని మొదలు పెట్టింది. ఈ నగరం కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి పవర్ హౌస్‌లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలే టార్గెట్‌గా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్‌ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి.యుద్ధం మొదలైన 8 రోజుల తర్వా ఓ నగరాన్ని రష్యా సైన్యం పూర్తి స్థాయిలో లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటన చేసింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా ఈ విషయాన్ని  ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ స్థానిక ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్‌ పిలుపునిచ్చారు.పుతిన్ ధ్వంస రచనతో ప్రపంచం హై అలర్ట్ అయ్యింది. చరిత్రలో ఇంతవరకూ ఏ దేశాధినేతా చెయ్యని దాడి పుతిన్‌ చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై అణుబాంబు వెయ్యకపోయినా, అలాంటి విధ్వంసానికే ఆరంభం పలికారు. దేశానికి 40శాతం న్యూక్లియర్‌ పవర్‌ను అందిస్తున్న జఫ్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై తెగబడింది రష్యా. ఆ ప్లాంట్‌పై వరుస దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే మంటల్లో చిక్కుకుంది పవర్ ప్లాంట్‌. ఇప్పుడు జెలెన్‌స్కీ రష్యాతో యుద్ధ మే చెయ్యాలా… ఉక్రెయిన్ సహా పొరుగు దేశాలనూ కాపాడేలా పవర్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలా.. అన్నట్లుంది పరిస్థితి. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ ఖెర్సన్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు పోల్‌, ఖార్కివ్‌, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్‌ నగరాలను దిగ్భంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ ఉక్రెయిన్‌-రష్యా మధ్య రెండో విడత చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. రష్యా దిగ్బంధించిన నగరాల నుంచి పౌరులు తరలివెళ్లేందుకు సురక్షిత కారిడార్ల ఏర్పాటుకు చర్చల్లో ఇరుదేశాలు అంగీకరించాయి. మరోవైపు యథావిధిగా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ ఓడరేవుతోపాటు ఆ నగరాన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించుకుంది రష్యా సైన్యం. నల్ల సముద్రం తీరంలోని ఈ ఓడరేవు కీలకమైనది. తీరంతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేయాలని వారం రోజులుగా రష్యా ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం పోర్టుతో పాటు ఖేర్సన్‌ పాలన యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకుందని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. యుద్ధం మొదలయ్యాక ఇలా ఒక నగరం రష్యా చేతిలోకి వెళ్లడం ఇదే ప్రథమం. పరిస్థితిని నియంత్రించడంపై అక్కడి అధికారులతో రష్యా కమాండర్లు చర్చలు జరుపుతున్నారు. దీనిని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు ఖండిస్తున్నాయి.యుద్ధం మొదలైన 8 రోజుల తర్వా ఓ నగరాన్ని రష్యా సైన్యం పూర్తి స్థాయిలో లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటన చేసింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా ఈ విషయాన్ని  ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ స్థానిక ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్‌ పిలుపునిచ్చారు.

Related Posts