YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రైల్వే జోన్ కు లేని కేటాయింపులు

రైల్వే జోన్ కు లేని కేటాయింపులు

ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ.సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటు నిమిత్తం రూ. 170 కోట్ల కేటాయింపులు జరిపినట్టు తెలిపింది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వరుసగా రూ. 3 కోట్లు, రూ. 40 లక్షలు, రూ. 40 లక్షలు నిధుల విడుదల చేసింది. ఇప్పటి వరకు విశాఖ జోన్, రాయగఢ డివిజన్ నిమిత్తం నయా పైసా ఖర్చు పెట్టలేదని స్పష్టం చేసింది కేంద్రం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓఎస్డీని నియమించామని కేంద్ర రైల్వై శాఖ. తెలిపింది.ఇప్పటి వరకు విశాఖ జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్దం కాలేదని స్పష్టం చేసింది కేంద్రం. తెలంగాణలో కాజీపేట కేంద్రంగా ఎలాంటి డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Related Posts