YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బియ్యపు  ఆకర్ష్ రెడ్డి   పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంధర్బంగా  ఆకర్ష్ రెడ్డి  శ్రీకాళహస్తిశ్వరాలయ దేవస్తానం ఛైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ముందుగా వైకాపా కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎవరితో పొత్తు లేకుండా ప్రజల బలంతో జగనన్న ఒక్కరి పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్నారు అని అన్నారు.నాడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలలో నేడు ఆనందోత్సవాలు చూస్తున్నామని తెలిపారు. ఆకర్ష్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే జగనన్న వెంట నడిచిన మొదటి వ్యక్తి తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డి  ,శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మేల్యే అని అన్నారు.కడదాక జగనన్న వెంటే మా కుటుంబం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts