YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎయిమ్స్ ను సందర్శించిన గవర్నర్

ఎయిమ్స్ ను సందర్శించిన గవర్నర్

యాదాద్రి భువనగిరి
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌం దర్య రాజన్  యాదాద్రి భువన గిరి జిల్లా  బీబీ నగర్ ఎయిమ్స్ ని  సందర్శించారు.  2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యా ర్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెరమోనీ కార్యక్ర మాన్ని  గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు. ఎయిమ్స్ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థు లకు వైట్ కోట్ ను ధరింపజే శారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి రిపోర్ట్ ని వీడియో ద్వారా వివరించారు. భవిష్యత్ లో బీబీ నగర్ ఎయిమ్స్ ఎలా రూపొందనుందో వీడియో ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ తమిళ సై వీక్షించారు.
ఎయిమ్స్ లో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తన అనుభ వాలను వైద్య విద్యార్థులకు వివరించారు. వైద్య విద్యా ర్థులందరికీ గవర్నర్ శుభాకాం క్షలు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావా లన్నారు.  నా భర్త నెఫ్రాలజిస్ట్ అని , తాను గైనకాలజిస్ట్ ని వెల్లడించారు.ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిది. కానీ పుట్టే పిల్లలు నల్లగా అవుతారని ఐరన్ మాత్రలు గర్భిణులు పడేస్తు న్నారని అన్నారు.  ఐరన్ మాత్రలు గర్భిణులు వేసుకుంటే పుట్టే పిల్లలు బలంగా పుడతారు. ఇలాంటి వాళ్ళకు మనం అవగాహన పరచాలన్నారు. రోగుల తో ఎక్కువ మాట్లాడాలని విద్యా ర్థులకు సూచించారు. వారు చెప్పే విషయాల ద్వారా ఎక్కు వ నేర్చుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని యువ వైద్యులకు సూచిం చారు. మీరు నేర్చుకునేది సిన్సియర్ గా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.విద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. వృత్తి ని ఎంజాయ్ చేయాల న్నారు. విద్యార్థులు చిన్న చిన్న పరిశోధన లు చేయాలని తద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని అన్నారు.
ఫెటల్ థెరపీ నేర్చుకోవడం   కోసం  నేను  కెనడా వెళ్ళాన న్నారు. డిజబుల్ పిల్లలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థి తుల్లో విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాస్ లు నిర్వహించి నందుకు బీబీ నగర్ ఎయిమ్స్ సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు.  
మెడికల్ ఎడ్యుకేషన్ కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంద న్నారు.  ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలులో ఉంద న్నారు. ఇది పెద్ద ఇన్సూరెన్స్ ప్రోగ్రాంని వెల్లడించారు. నేను ఇక్కడా పుదుచ్చేరి కి కూడా గవర్నర్ గా పని చేస్తున్నానని అన్నారు. అత్యంత తక్కువ వయసులో గవర్నర్ ని అయ్యానన్నారు.

Related Posts