YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకానందరెడ్డి కూతురి భవిష్యత్తుపై నీలినీడలు

వివేకానందరెడ్డి కూతురి భవిష్యత్తుపై నీలినీడలు

హైదరాబాద్, మార్చి 14,
మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన హత్య మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ హత్యకు సుపారీ పేరుతో కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో వాటి సంగతి చూసేందుకు నేడోరేపో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగుతోందనే ప్రచారం అయితే హోరెత్తి పోతోంది.మరోవైపు వైయస్ వివేకా హత్యతో ఆమె కుమార్తె వైయస్ సునీత కుటుంబం తీవ్ర కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఇఫ్పటికే ఆమె తీవ్ర దు:ఖంలో ఉన్నారు. సొంత పెద్దనాన్న వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు మాత్రం న్యాయం జరగలేదనే ఓ విధమైన ఆందోళనతో పాటు ఆమెను పలు సందేహాలు వెంటాడుతున్నట్లు సునీత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.ఆ క్రమంలోనే సునీతతోపాటు ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ కూడా ఏపీ హైకోర్టు మెట్లు ఎక్కారని వారు చెబుతున్నారు. అయితే వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలుకు సీఎం వైయస్ జగన్ అండ్ కో అండ దండ ఉన్నాయని కడప జిల్లాలో టాక్ అయితే వైరల్ అవుతోంది. అలాగే వైయస్ ఫ్యామిలీలోని మిగతా వారంతా సునీతతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన తండ్రి హత్య కేసులో వైయస్ సునీతకు న్యాయం జరిగుతోందా అంటే.. ఆ పరిస్థితి మాత్రం కనబడడం లేదనే ఓ చర్చ అయితే పులివెందుల సాక్షిగా నడుస్తోంది.అంతేకాదు.. వైయస్ వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తాగిరి అప్రూవర్‌గా మరి.. సీబీఐ ఎదుట వైయస్ వివేకా హత్య జరిగిన తీరును పూసగుచ్చినట్లు.. వివరించారు. దీంతో ఈ హత్యలో సూత్రధారులు, పాత్రధారులు సైతం కొత్త స్కెచ్ వేసి.. దర్యాప్త సంస్థపైనే కాకుండా.. సీబీఐ అధికారులతోపాటు వైయస్ వివేకా కుమార్తె, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై కూడా ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ సునీత.. తీవ్ర ఒత్తిడికి గురై.. మానసికంగా ఆందోళన చెందినట్లు .. ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అసలు తన తండ్రి హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆయన హత్య.. వెనక ఉన్న కారణాలు ఏమిటి? తన తండ్రి హత్య వల్ల ఎవరికీ లాభం ? ఈ హత్యకు సూత్రధారులు , పాత్రధారులు ఎవరు?... ఇత్యాది అంశాలు ప్రపంచానికి తెలియాలనే ఓ విధమైన పట్టుదలతో వైయస్ సునీత ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సోదరుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో చెప్పినా.. తమ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలతో మాట్లాడినా.. చివరకు నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసినా.. తనకు న్యాయం జరుగుతోందన్న చిన్న ఆశ కూడా ఆమెలో లేకుండా పోయిందని సునీత ఫ్యామిలీలోని వారే అంటున్నారు. ఆ తర్వాత.. అసలు విషయం అర్థమై.. సునీత స్వయంగా రంగంలోకి దిగడంతో.. ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ కూడా.. సునీతతో నడిచారని తెలుస్తోంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.మరోవైపు.. కడప లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతానంటూ.. వైయస్ వివేకా.. తన అన్న కుమారుడు వైయస్ జగన్ పార్టీలోని కీలక నేతలను సంప్రదించడం. అందుకు వారు నో చెప్పారని తెలుస్తోంది. ఆ క్రమంలో సైకిల్ పార్టీలోకి వెళ్లి.. ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవాలని వైయస్ వివేకా భావించడం.. ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారనే టాక్ అయితే కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. వివేకా తనయ వైయస్ సునీత కూడా టీడీపీలోకి వెళ్తుదంటూ.. ఇటీవల ఓ వర్గం మీడియా అయితే గట్టిగానే ప్రచారం చేసింది. అయితే ఇప్పటికే సునీతపై ఓ విధమైన కుట్ర తాలుక .. ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్నా ఆమె.. మరో పార్టీలోకి వెళ్లితే.. సునీత జీవితంపై బలమైన దెబ్బ పడే అవకాశం ఉందని.. ఆ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్ప వాటిల్లే ప్రమాదం కూడా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సునీతకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన అసలు లేనే లేదని ఆమె ఫ్యామిలీలోని సభ్యులే చెబుతున్నారు.ఓ వేళ తన తండ్రి వివేక హత్య కేసులో దోషులు ఎవరనేది తెలితే.. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి.. తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదని వారే అంటున్నారు. ఏదీ ఏమైనా.. వివేకా హత్య కేసులో దోషుల ఎవరనేది తెలిస్తే..  వైయస్ సునీత.. తన పొలిటికల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయనే చర్చ కూడా కడప జిల్లాలో జోరుగానే నడుస్తోంది.

Related Posts