YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో 3246 మురికి వాడలు

ఏపీలో 3246 మురికి వాడలు

విజయవాడ, మార్చి 15,
ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేసిన మురికివాడలు  3,246 ఉన్నట్లు కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ ఈ రోజు రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మురికివాడల్లో నివసించే జనాభా సంఖ్య 37 లక్షల 93 వేలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాచారమిచ్చినట్లు తెల్పింది. 2011 – 2014 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 4 మురికివాడల ప్రజలకు పాక్షిక పునరావాసం కోసం 1,205 ఇళ్ళను నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెల్పింది. అలాగే జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్‌ కింద రాష్ట్రంలోని మురికివాడల్లో నివసించే ప్రజల కోసం 13,706 ఇళ్ళ నిర్మాణాలు జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. 2015 జూన్‌లో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) అర్హులైన అన్ని కుటుంబాలు, లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు, నోడల్‌ ఏజెన్సీలకు ఆర్థిక సహాయం ఇందిస్తోందని మంత్రి తెలిపారు. పీఎంఏవై (అర్బన్‌) కింద మురికివాడల్లోని అర్హులైన లబ్ధిదారుల కోసం 20.43 లక్షల ఇళ్ళను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. 2015-16 నుంచి 2021-22 వరకు పీఎంఏవై(అర్బన్‌) కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 31 వేల 88 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, వాటిల్లో ఇప్పటి వరకు 11,755 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు.

Related Posts