YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉప్పులూరులో “ గ్లకోమా ” అవగాహనా కార్యక్రమం

ఉప్పులూరులో “ గ్లకోమా ” అవగాహనా కార్యక్రమం

కంకిపాడు
కృష్ణాజిల్లా  కంకిపాడు మండలం  ఉప్పులూరు ప్రాథమిక కేంద్రంలో అంతర్జాతీయ నీటి కాసుల అవగాహన వారోత్సవాలు మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న తరుణంలో  డాక్టర్ సుందర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ వి.వి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ గ్లకోమా ( నీటికాసులు ) కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి కంటి నరములు దెబ్బతినడాన్ని “ గ్లకోమా ” ( నీటికాసులు ) అంటారు . దీని వలన క్రమేపి చూపు తగ్గి అంధత్వం రావటం జరుగుతుంది.  కొందరికి కంటిలో విపరీతమైన కంటిపోటు వచ్చి కళ్ళు ఎర్రబడటం జరుగుతుందని అన్నారు.  వెంటనే కంటి వైద్యులను సంప్రదించి , గ్లకోమా పరీక్షలు చేయించుకుని , సలహా మేరకు అవసరమైన కంటి మందులు క్రమం తప్పకుండా వాడవలసిన అవసరం ఉంటుంది. గ్లకోమాని ప్రారంభంలో గుర్తించినట్లయితే అంధత్వం రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.  ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అజ్మత్ తహారా, డాక్టర్ అనిల్, డాక్టర్ సహీన,  ఆప్తాల్మిక్ ఆఫీసర్ , వి. వి .రాజేష్  కుమార్  ,  భాస్కర్ రెడ్డి, స్టాఫ్ నర్సులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts