YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటకలో సెంటిమెంట్ గెల్చింది

కర్ణాటకలో సెంటిమెంట్ గెల్చింది

క‌ర్ణాట‌క‌లో సెంటిమెంట్ గెలిచింది. అధికార పార్టీ కాంగ్రెస్ ఊహించ‌న ప‌రిణామం తెర‌మీద క‌నిపిస్తోంది. తిరిగి అధికారం చేజిక్కించుకుంటామ‌ని భావించిన కాంగ్రెస్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు ఊహించ‌ని దెబ్బ‌కొట్టారు. కాంగ్రెస్‌కు 77 స్థానాల్లోనూ ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించింది. దీంతో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఘోర‌మైన ప‌రాజ‌యం పాలైంది. దీంతో ఇప్పుడు క‌ర్ణాట‌క సెంటిమెంట్‌పై విశ్లేష‌ణ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఏ ప్ర‌భుత్వాన్ని తిరిగి ఎన్నుకునే సంస్కృతి లేదు.ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీని మరో ఎన్నికల్లో మట్టి కరిపించడం కర్ణాటక ప్రజల సంప్రదాయం. వారి సెంటిమెంట్‌. క‌ర్ణాట‌క‌లో గ‌త‌ 30 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టంగట్టిన ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడుతున్నారు. బలమైన వారి సంప్రదాయం ముందు కాంగ్రెస్‌ ఎన్నికల ఎత్తులు కూడా చిత్తయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ విస్తతంగా ప్రచారం చేయడంతోపాటు తన వైఖరికి భిన్నంగా గుళ్లూ గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు తిరిగారు.గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ద్వారా నాయకత్వ పరిణితి పొందిన రాహుల్‌ గాంధీ కర్ణాటక ఎన్నికల్లో మరింత నాయకత్వ పరిణితితో వ్యవహరించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా చూశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మాట తీరును మార్చు కున్నారు. మాటను మాటతోనే తిప్పి కొట్టడమూ నేర్చుకున్నారు. గుజరాత్‌తో అతి తక్కువ‌ మెజారిటీ సాధించిన బీజేపీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఓటమి తప్పకపోవచ్చని, జోరు మీదున్న రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇక సిద్ధరామయ్య బీజేపీకి బలమైన లింగాయత్‌లను పార్టీకి దూరం చేసేందుకు కృషి చేశారు. వారిని ప్రత్యేక మైనారిటీ మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, ఇతర ఓబీసీ వర్గాల సమీకరణ కు ‘అహిందా’ దక్పథాన్ని అనుసరించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల సెంటిమెంట్‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Related Posts