YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కొలువుతీరిన వెంకన్న

విశాఖలో కొలువుతీరిన వెంకన్న

విశాఖపట్నం
టిటిడి ఆధ్వర్యంలో తిరుమల తరహాలో రుషికొండపై శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు.తెల్లవారుజాము నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు ఆలయ ఆవరణలో ఆంజనేయస్వామి కొలువు దీరే మహాక్రతువును పూర్తి చేశారు.టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆలయాన్ని శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదగా చేతుల మీదగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దర్శించనున్నారు.ఋషి కొండ పై శ్రీ వారి ఆలయం ద్వారా ఉత్తరాంధ్ర లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని ప్రముఖులు టిటిడి చేసిన కృషిని కొనియాడారు.
శుభగడియల వేళ శ్రీవేంటేశ్వర స్వామి స్టీల్ సిటీలో అడుగు పెట్టారు.అడుగుడుగునా ఉప్పొంగే భక్తి భావం మది నిండా స్వామి వారి నామస్మరణతో స్వామి వారి ఆలయం వైపుగా అడుగులు వేస్తున్న భక్త జనుల రాకతో ఋషికొండ ఆద్యాత్మికతతో పులకించిపోయింది.విశాఖ సాగర తీరం లోని ఋషికొండ లలో ఒక కొండపై 10 ఎకరాల స్థలంలో 28 కోట్ల వ్యయం తో టీటీడీ నిర్మించిన ఈ వేంకటేశ్వరుని ఆలయం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు.టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని రిషికొండపై వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయానికి ఎదురుగా తిరుమల తరహాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఆలయాలను నిర్మించారు. టీటీడీ శిల్ప కళాకారులు తయారుచేసిన దేవతా విగ్రహాలను తిరుమల నుంచి విశాఖకు తీసుకువచ్చి కొలువుదీర్చారు.ఇక్కడ నిత్యం పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు పూజారులను కూడా నియమించనున్నారు.దేవాలయం కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, 150 మంది పట్టే ధ్యాన మందిరం, కల్యాణోత్సవ వేదిక, కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేనివారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ప్రసాదాలు,ప్రత్యేక పూజుల చేయ్యించుకోవచ్చు తిరుమలలో ఎవిదమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కుడా అలాంటి సేవలను ఎర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా అన్ని ఎర్పాట్లు చేసారు. మెుత్తం మీద ఎపుడెప్పుడా అని ఎదురు చుస్తున్న వేంటేశ్వరస్వామి దర్శనం ప్రజల ముంగిట్లోకి రావడంతో భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts