YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు..

యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు..

- యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్డుతో చంపుతానో నాకే తెలీదు

- ‘టచ్‌ చేసి చూడు’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’ అంటూ సవాల్‌ విసరబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్‌లో రవితేజ కుటుంబం గురించి వివరిస్తూ..‘ఎ ఫ్యామిలీ ఈజ్‌ యాన్‌ ఓషన్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌. అసలు ఫ్యామిలీ అంటే..’ అని చెప్తుండగా వెనక నుంచి ‘వద్దురా రేయ్‌ వద్దు..’ అన్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. పోలీస్‌ గెటప్‌లో రవితేజ మరోసారి అదరగొట్టేశాడు. ‘యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్డుతో చంపుతానో నాకే తెలీదు’ అని చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మరోపక్క రవితేజ తన సినిమాల జోరు పెంచేశారు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘అ!’ చిత్రంలో ఓ చెట్టుకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. మాళవిక శర్మ ఇందులో కథానాయిక. రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘నేల టికెట్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది.

Related Posts