YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి

మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి

పెద్దపల్లి
మత్యకారుల, మహిళల అభివృద్ది కొరకు ఈ నెల 4నుండి, మే 20వరకు నూతన సహకార సంఘాల రిజిస్ట్రేషన్ల ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వం  నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ముదిరాజ్ మహసభ జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ది కార్పోరేషన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవుకు ముదిరాజుల పక్షాన కృతఙతలు తెలియజేస్తు న్నట్లు ముదిరాజ్ మహసభ జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ, మత్యకారుల, మహిళల అభివృద్ది కొరకు ఈ నెల 4నుండి, మే 20వరకు నూతన సహకార సంఘాల రిజిస్ట్రేషన్ల ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వం  నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జాతీయ సహకార అభివృద్ది కార్పోరేషన్  ద్వారా మత్స్యకారుల కొరకు 64వేల ద్విచక్ర వాహనాలతో పాటు, ఫోర్ వీలర్, వలలు, ఇతర పనిముట్లను అందించి ఆదుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. జీవో 98ద్వారా 29కులాలకు చేపలు పట్టుకునే హక్కును, జీవో 265 ద్వారా మత్స్యశాఖను ఫిషరీస్ శాఖలో విలీనం చేయడం స్వాగతించదగ్గ   విషయమన్నారు. మత్య్స మార్కెటింగ్ సొసైటి  నిర్వహణకు ఆమోదం తెలపడం ద్వారా నీటి సామర్థ్యంతో సంబందం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేషంలో  వైస్ ఎంపీపి ముత్యాల రాజయ్య, నాయకులు డిష్ సదానందం, కొలిపాక శ్రీదర్, కందుల రాజు, యాదగిరి  ఓదెలు, గుండా లక్ష్మన్  తదితరులు పాల్గొన్నారు.

Related Posts