YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆర్టీసీ మరో షాక్‌

ఆర్టీసీ మరో షాక్‌

హైదరాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల వీపు మోత మోగిస్తోంది. వరుసగా ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల చేతి చమురు వదిలిస్తోంది. ఇటీవల రౌండప్‌, టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా మరో షాక్‌ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్‌ ఛార్జీలు అమాంతం పెంచేసింది. అయితే పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. ఒక్కో రిజర్వేషన్ పై 20 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచినట్లు సమచారం. కాగా రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీ ఆ నష్టాలను పూడ్చుకునేందుకు వరుసగా ఛార్జీలు పెంచుతోంది. గతంలో రౌండ్‌ ఫిగర్‌ పేరుతో పల్లె వెలుగు బస్‌ టికెట్లను పెంచిన టీఎస్‌ఆర్టీసీ ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున పెంచేసింది. అదేవిధంగా సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు టికెట్‌ రేట్లను పెంచేసింది. కాగా స్వల్ప వ్యవధిలో ఇలా అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అన్ని వస్తువుల ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

Related Posts