YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

ముంబై, ఏప్రిల్ 21,
రష్యా-ఉక్రెయిన్ యుద్దం( కారణంగా నిత్యావసర వస్తువులు, ఇంధనం, మరెన్నో ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో సిమెంట్‌ ధరలు కూడా భారీగా పెరగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్‌  సంస్థ వెల్లడించింది. ఇప్పటికే పలు సార్లు పెరిగిన సిమెంట్ ధరలు సమాన్యుల కలలను ఆవిరిచేశాయి. ఇదే తరుణంలో మరో సారి సిమెంట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా.. బొగ్గు, పెట్ కోక్, ముడి చమురు ధరలు భారంగా మారటం వల్ల.. ఈ నెలలో సిమెంట్ బస్తా మరో రూ.25 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశముందని  రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. సిమెంట్ తయారీలో వినియోగించే బొగ్గు, పెట్ కోక్ ధరలు గత ఆరు నెలల కాలంలో 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరగటమే పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోందని క్రిసిల్ తెలిపింది.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా కీలక ముడిపదార్ధాలైన బొగ్గు, పెట్‌ కోక్‌తో పాటు.. ముడి చమురు దిగుమతులు భారంగా మారాయి. ఈ ప్రభావం సిమెంట్‌ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి యుద్ధం కారణంగానే.. బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు గడిచిన ఆరు నెలల్లో 30-50 శాతం పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో దేశంలో ఒక్కో సిమెంట్‌ బస్తా ధర రూ.390కి పెరిగింది. పెరిగిన ఉత్పాదక వ్యయాన్ని వినియోగదారులపై సిమెంట్‌ కంపెనీలు వేస్తే.. ఈ నెలలో బస్తా సిమెంట్ రేటు మరో రూ.25-50 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇంధనం, విద్యుత్, రవాణా ఛార్జీలు పెరగడంతో సిమెంట్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని దక్షిణ భారత సిమెంట్‌ తయారీదారుల సంఘం చెబుతోంది.ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవటం, ఇండోనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు తగ్గడం వల్ల ధరల పెంపు అనివార్యమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పెట్ కోక్ ధరలు మార్చి క్వార్టర్ లో 43 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా పెట్ కోక్ ధర 96 శాతం పెరిగింది. దేశీయ పెట్ కోక్ ధరలు మార్చిలో 23 శాతం, ఏప్రిల్ నెలలో 21 శాతం మేర పెరిగాయి. సముద్ర రవాణా ఖర్చులు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల కారణంగా పెట్ కోక్ దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పోల్చితే టన్నుకు 130 డాలర్ల మేర పెరిగింది. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అఫోర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ పెరగడం, మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో సిమెంట్ వినియోగం 5-7 శాతం పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. దీనివల్ల ఇళ్లు నిర్మించాలనుకునే వారిపై భారీగా భారం పడనుంది.

Related Posts