YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లా జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్..ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

జిల్లా జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్..ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

జగిత్యాల ఏప్రిల్ 30
జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, డబుల్ బెడ్ రూములు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. జైపాల్ డిమాండ్ చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైనా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం నాడు జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లోగల దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని అన్నారు. ఫెడరేషన్ కార్యకలాపాలకు అనుగుణంగా జిల్లా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు దాడుల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. జిల్లా కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఫెడరేషన్ కమిటీలను నియమించడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం త్వరలోనే ఫెడరేషన్ నూతన సభ్యత్వ నమోదు కార్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. అనారోగ్య సమస్యలు, గుండెపోటు, కోవిడ్ -19 చే మరణించిన జర్నలిస్టులకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షడు ద్యావర సంజీవరాజు, కార్యదర్శి సోమ జీవన్ రెడ్డి లు సభలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. ఆలాగే పాత అక్రిడేషన్ల కాలపరిమితి మరోసారి గడువును పొడగించకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలిశెట్టి మదన్ మోహన్ మాట్లాడుతూ జిల్లా కమిటీ సభ్యులు ఫెడరేషన్ బలోపేతం చేసేందుకు కార్యాచరణ తో కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఫెడరేషన్ ను బలోపేతం చేసేందుకు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా గురుమంతుల నారాయణ, గుర్రం చంద్రశేఖర్ లను జిల్లా కమిటీలో నియమించారు. ఇంకా ఈ సమావేశంలో కట్కూరి మల్లేశం, మాకు రాజలింగం, మెన్నెని శ్రీనివాసరావు, హైదర్ మతిన్, గాజుల శ్రీనివాస్, మామిడిపెళ్లి లక్ష్మన్, ఆముద లింగారెడ్డి, శ్రీగద్దెల ప్రవీణ్ కుమార్, బలిజ సంతోష్ కుమార్, లవంగా గణేష్ పాల్గొన్నారు.

Related Posts