YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొలిటికల్ పార్టీలకు425 కోట్ల హైదరాబాదీల విరాళాలు

పొలిటికల్ పార్టీలకు425 కోట్ల హైదరాబాదీల విరాళాలు

హైదరాబాద్, మే 2,
రాజకీయ పార్టీలకు గుట్టుగా విరాళాలిచ్చే వ్యవస్థ్ ను మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకు వచ్చింది. అవే ఎలక్టోరల్ బాండ్లు. ఈ బాండ్ల లక్షణం ఏమిటంటే… సీక్రెసీ. ఆ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఎవరిస్తున్నారో ఎవరికీ తెలియదు.. ఆ ఒక్క పార్టీకి తప్ప. అలాగే ఆ ఫండ్స్ ఎక్కడ్నుంచి వచ్చాయో కూడా ఎవరూ అడగరు. అలాంటి ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాల్లో ఇప్పుడు హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. నెంబర్ వన్నంటే అలాంటిలాంటి వన్ కాదు. ఒక్క హైదరాబాద్‌లోనే రూ. 425కోట్ల ఎలక్టోరల్ బాండ్లను బ్యాంకుల వద్ద నుంచి కొన్నారు. వీటిని ఆయా వ్యక్తులు రాజకీయ పార్టీలకు ఇస్తారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ నగరంలోనూ కొనలేదు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.106 కోట్లు , చెన్నైలో రూ. వంద కోట్లు, భువనేశ్వర్‌లో రూ. మూడు కోట్లు , కోల్ కతాలో పద్దెనిమిది కోట్ల ఎలక్టోరల్ బాండ్లు మాత్రమే విక్రమయ్యాయి. వీటిని ఎస్‌బీఐ అమ్ముతూ ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఇంత పెద్ద మొత్తం ఎవరు కొన్నారు..? ఏ పార్టీకి ఇచ్చారు ? అనే విషయాలపై పెద్దగా చర్చ విశ్లేషణ అవసరం లేదు. అధికార పార్టీలకే ఎవరైనా నిధుల వరద పారిస్తారు. హైదరాబాద్‌లోనూ అదే జరుగుతుంది. అయితే అధికార పార్టీకే ఎందుకు ఇస్తారో చెప్పాల్సిన పని లేదు. వ్యాపారాలు సజావుగా నిర్వహించుకోవడాని… అధికార బలం అడ్వాంటేజ్ కోసం ఇస్తారు. మరికొంత మంది కాంట్రాక్టర్లు తమ ఉడుతా భక్తిని చెల్లించుకుంటారు. కానీ వీటికి ఎలక్టోరల్ బాండ్లు అధికారిక ముద్ర వేస్తున్నాయి కాబట్టి చట్టబద్దమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఎక్కవ ఎందుకు ఉందనేది అంతుబట్టని విషయం. ఎన్నికల వేడి పెరుగుతూండటంతో వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఇలా అప్పుడే నిధుల సేకరణ ప్రారంభించాయని భావిస్తున్నారు.

Related Posts