YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ నేతలకు రెండు విడిది కేంద్రాలు

బీజేపీ నేతలకు రెండు విడిది కేంద్రాలు

హైదరాబాద్, జూన్ 28,
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అధికారికంగా జూలై 2, 3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న.. ఈ నెల 30వ తేదీ వరకే చాలా మంది నేతలు హైదరాబాద్ రాబోతున్నారు. జూలై 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు జేపీ నడ్డా రానున్నారు. అలాగే ప్రధాని మోడీ జూలై 2వ తేదీన మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ పాల్గొంటారు. ప్రధాని బసకు సంబంధించి రాజ్ భవన్తో పాటు మరో రెండు చోట్ల విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా కారణాల వల్ల ఎస్‌పీజీ ప్రత్యేక బస ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నొవాటెల్తో పాటు, శంషాబాద్సమీప ప్రాంతంలో ఆ విడిది కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ మూడు ప్రాంతాలతో పాటు అవసరమైతే మరిన్ని ప్రైవేట్ప్రాంతాలు కూడా ఎంచుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలు, సభపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నజర్ పెట్టినట్లు సమాచారం. సమావేశాలు నిర్వహించే హెచ్ఐసీసీ, సభ ప్రాంగణం, బీజేపీ కార్యాలయంలో ఎవరికీ తెలియకుండా ఎప్పటికప్పుడు విషయాలను రాష్ట్ర సర్కార్కు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క బీజేపీ స్టేట్ఆఫీస్లోనే 11 మంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతలా ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.వీరంతా సాధారణ వ్యక్తుల్లా వచ్చి బీజేపీ కార్యాలయానికి వచ్చి అక్కడేం జరుగుతోంది, సమావేశాలు, సభ నిర్వహణపై ఎలాంటి వ్యూహరచన చేపడుతున్నారనే అంశాలను మినట్టు మినట్నేరుగా ప్రగతి భవన్కు చేర వేస్తున్నట్లు టాక్. బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్అదనంగా ఇంటెలిజెన్స్ ను దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు 'సాలు దొర‌‌-సెలవు దొర' అనే పేరిట కేసీఆర్ ను గద్దె దించే కౌంట్డౌన్తో డిజిటల్బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. పోలీసులను పంపించి తొలగించాలని కోరగా.. తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం తిరిగి ప్రారంభించారు. అయితే బీజేపీ నేతలు టెక్నికల్ కారణంగానే నిలిపివేసినట్లు చెబుతున్నారు.ప్రధాని మోడీ 2, 3 తేదీల్లో నిర్వహించే సమావేశాలకు హాజరు కానున్నారు. 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గంటలకు హెచ్ఐసీసీ నుంచి ప్రధాని మోడీ పరేడ్గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశాలు రాత్రి 8 గంటల వరకు ముగిసేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సభకు 2,500 బస్సులతో పాటు అదనంగా వాహనాలను బీజేపీ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts