YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లో ఫ్లెక్సీ వార్

హైదరాబాద్ లో ఫ్లెక్సీ వార్

హైదరాబాద్, జూన్ 30,
హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.  ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ లోని హైటెక్స్ లో వచ్చే నెల 2,3 తేదీలలో జరగనున్న బీజీపీ కార్యకర్గ సమావేశాలకు హాజరౌతున్న నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వచ్చే నెల 3న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.  పార్టీ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో జంట నగరాలలో బీజేపీ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అన్నిటి కంటే ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పనైపోయిందన్న అర్ధం వచ్చేలా ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీవార్ కు కారణమైందని అంటున్నారు.  మోడీ బహిరంగ సభ జరగనున్న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిలో ‘ సాలు మోడీ.. సంపకు మోడీ’ అన్న ఫ్లెక్సీ ప్రాధాన్యత  సంతరించుకుంది.ఇక కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా  నల్లధనం వెనక్కి తెప్పించడం సహా, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు.  ఇవే కాకుండా పలు ఫ్లెక్సీలు కూడా మోదీకి వ్యతిరేకంగా వెలిశాయి. కాగా ఈ  హోర్డింగ్ లు, ప్లెక్సీలు   ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు.బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది ఎవరన్నది తెలియకపోయినా, వీటి వెనకున్నది టీఆర్ఎస్సేనని బీజేపీ ఆరోపిస్తోంది. గత రెండు రోజులుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది.  ఈ ఫ్లెక్సీ వార్ నేపథ్యంలో  బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకదాని తీరును మరోటి తప్పుపడుతున్నాయి.  

Related Posts