YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోమయంలో అధికారులు....

అయోమయంలో అధికారులు....

విజయవాడ, జూలై 28,
జగన్ పాలనలో కోర్టు ఆదేశాల ఉల్లంఘన, నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుండటంతో రేపేదైనా తేడా వస్తే అధికారులే ముద్దాయిలుగా బోనులో నిలబడక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయినా కూడా వారేం చేయలేక ఏలిన వారి ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి. తాజాగా విశాఖ రుషి కొండ తవ్వకాలు, నిర్మాణాల విషయంలో సుప్రీం ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా అక్కడ జరుగుతున్న పనులను గమనిస్తే ఆధికారులను బలిపశువులను చేసే దిశగా జగన్ వారి చేత నిబంధనలు ఉల్లంఘించైనా సరే పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చారని అనిపించక మానదు. రిషికొండ నిర్మాణాలపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది.రిషికొండ తవ్వకాలపై ఇప్పిటికే సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. కొండ కొత్తగా ఎటువంటి తవ్వకాలూ చేపట్ట వద్దనీ, నిర్మాణాలు కూడా గతంలో నిర్మాణాలు ఉన్న చోటనే చేపట్టాలని విస్పష్ట రూలింగ్ ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పును యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రిషి కొండలో తవ్వకాలూ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త ప్రాంతాలలో నిర్మాణాలూ ఆఘమేఘాల మీద కొనసాగుతున్నాయి. సుప్రీం ఆదేశాలలో ఏక్కడో అక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చని ఉంది కనుక మనం ఎక్కడ అనుకుంటే అక్కడే నిర్మాణాలు చేసేద్దామన్న రీతిలో ఇష్టారీతిన నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది.అది కూడా వందల మంది కార్మికులను నియమించి వాయు వేగంతో నిర్మాణాలుపూర్తి చేస్తున్నది. భవిష్యత్ లో సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే.. కోర్టును తపపుదోవ పట్టించినందుకు, ఆదేశాలను ఉల్లంఘించినందుకు బోనెక్కాల్సింది ముఖ్యమంత్రి కాదు. దగ్గరుండి పనులు చేయించిన మంత్రులూ కాదు. అధికారులే. అందుకే జగన్ పాలనలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కగా మారింది. నిబంధనల మేరకే పని చేస్తామంటూ సీఎం ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కోర్టు బోనెక్కి తప్పు నిబంధనల ఉల్లంఘన నిరూపితమైతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తృటిలో శిక్షను తప్పించుకుని సామాజిక సేవ చేయడానికి అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పలువురు అధికారులు కేసుల్లో ఇరుక్కుని జైలు జవితం అనుభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అదే విధంగా అధికారులు దోషులుగా నిలబెట్టైనా సరే పబ్బం గడుపుకుందామన్న రీతిలో జగన్ తీరు ఉందని పరిశీలకులు చెబుతున్నారు

Related Posts