YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుడివాడ వీడిన మిస్టరీ

గుడివాడ వీడిన మిస్టరీ

విజయవాడ, జూలై 28,
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 15 బాలుడ్ని ఒక వివాహిత కిడ్నాప్ చేసిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందరూ అనుమానించినట్టుగానే ఈ కేసులో షాక్‌కి గురి చేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాయమాటలు చెప్పి ఆ బాలుడ్ని తీసుకెళ్లిన మహిళ.. హైదరాబాద్‌లో అతనితో సహజీవనం చేసినట్టు తేలింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ లొకేషన్ ఆధారంగా వివాహితని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గుడివాడ పట్టణంలో ఓ వివాహిత మహిళ (31) తన భర్త, నలుగురు పిల్లలతో నివాసముంటోంది. చిన్నారులతో సెల్ ఫోన్‌లో వీడియో గేమ్స్ తరచూ ఆడే ఈ వివాహిత.. ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడి పట్ల ఆకర్షితురాలయ్యింది. అతడ్ని శారీరంగా లోబర్చుకుంది. దీంతో.. ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. అతడ్ని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. ఆ బాలుడు తనకు ఎక్కడ దూరమవుతాడోనన్న భయంతో ఎస్కేప్ ప్లాన్ వేసింది. అతనికి మాయమాటలు చెప్పి.. ఈనెల 19వ తేదీన బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. హైదరాబాద్ బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని.. బాలుడితో సహజీవనం చేస్తోంది. తొలుత తమ అబ్బాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఎదురింట్లో ఆ వివాహిత కూడా మాయమైన విషయం తెలియడంతో.. ఆమెనే తమ పిల్లాడ్ని కిడ్నాప్ చేసిందని బాలుడి పేరెంట్స్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్నుంచే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో.. తనకు డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టుపక్కల వారికి మెసేజ్ చేశాడు. ఎవరూ స్పందించకపోవడంతో నేరుగా తల్లిదండ్రులకే ఫోన్ చేసి.. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే బాలుడి కోసం కొన్ని ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే బాలుడు ఫోన్ చేసిన విషయం తెలిసి, అతడు మాట్లాడుతున్నప్పుడే సెల్‌ఫోన్ లొకేషన్‌ని పసిగట్టారు. రాత్రి వారి ఇంటికి వెళ్లి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, గుడివాడకు తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. వివాహితపై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Related Posts