YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహిళలకు ఆర్టీసీ రక్షా బంధన్ కానుక

మహిళలకు ఆర్టీసీ రక్షా బంధన్ కానుక

హైదరాబాద్, జూలై 28,
ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీఎస్‌ ఆర్టీసీ అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించు కుంటూ అందివచ్చిన అన్ని అవకాశాలను వాడేసుకుంటోంది. . బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి వీలుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది.టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది

Related Posts