YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవిత విషయంలో ఏం జరగుతోంది

కవిత విషయంలో ఏం జరగుతోంది

హైదరాబాద్,  నవంబర్ 21, 
కల్వకుంట్ల కుటుంబం అంటే కేసీఆర్ మాట జవదాటదన్నది జగమెరిగిన సత్యం. గత ఎనిమిదేళ్లుగా రాజకీయ బిక్షను ఎందరికో కేసీఆర్ పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులు కీలక భూమిక పోషించారు. కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి మరీ వచ్చి ఉద్యమంలో చేరారు. కేసీఆర్ కుమార్తె కవిత జాగృతి సంస్థను పెట్టి తెలంగాణ సమాజాన్ని ఉద్యమ సమయంలో చైతన్య పరిచి తండ్రికి వెన్నుదన్నుగా నిలిచారు. అప్పుడు టీఆర్ఎస్ అనేది రాజకీయ పార్టీ అనే దానికన్నా ఉద్యమ పార్టీ అనుకోవచ్చు. అదే సమయంలో కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమంలో సాయపడిన తన కుటుంబ సభ్యులకు ముగ్గురికీ కీలక పదవులు ఇచ్చారు. తొలిసారి ప్రజల ఆశీర్వాదంతోనే వాళ్లు గెలిచారు. 2014కు ముందు నుంచి కూడా హరీశ్ రావుపై ఇటువంటి ప్రచారం జరిగేది. టీఆర్ఎస్ లో విభజన తెచ్చి హరీశ్ రావు మరొక పార్టీ పెడతారన్న ప్రచారం పెద్దయెత్తున జరిగింది. ప్రతి సారీ హరీశ్ రావును టార్గెట్ చేసుకునే వారు. రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కనప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించినప్పుడు హరీశ్ రావు అసంతృప్తితో ఉన్నారని, పార్టీని చీలుస్తారన్న వార్తలు వచ్చాయి.  గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో కల్వకుంట్ల కవిత కొన్నాళ్లు రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడు కూడా ఆమె అసంతృప్తికి లోనయినట్లు ప్రచారం జరగలేదు. కవితకు ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. దానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. కవిత కూడా పెద్దగా పార్టీ విషయాల్లో జోక్యం చేసుకునే నేత కాదు. ఆమె కేవలం నిజామాబాద్ జిల్లా రాజకీయాల వరకే పరిమితం అవుతారన్నది పార్టీ వర్గాలు చెబుతాయి. అయితే కవిత చెబుతున్నట్లుగా బీజేపీ ఆమెను ఆహ్వానించడం నిజమా? అన్నది తేలకుండా ఉంది. ఒక ముఖ్యమంత్రి కుమార్తెను పార్టీలోకి రావాలని ఆహ్వానించే ధైర్యం ఎవరికి ఉంటుంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కవితను బద్నాం చేస్తే ఆమె తండ్రి కేసీఆర్ నమ్ముతారా? ఆమెపై పార్టీ పరంగా చర్య తీసుకుంటారా? అంటే అది అసాధ్యమన్నది అందరికీ తెలుసు. ఇక ధర్మపురి అరవింద్ చెప్పినట్లు కవిత మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేయడంలో నిజమెంత? రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్నది అందరికీ తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారా? ఇవన్నీ కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలేనని అన్నది వాస్తవం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికి కవిత కొత్త డ్రామాలకు తెరదీస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. కానీ కవితకు ఆ అవసరం ఏంటి? తనను బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించినంత మాత్రాన బీజేపీ మైల పడిపోతుందా? రాజకీయ పార్టీ అన్నాక ఎవరినైనా ఆహ్వానించవచ్చు. చేరడమూ, లేకపోవడమూ వారి ఇష్టం. మరి తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎందుకు టార్గెట్ అయ్యారు? అన్నది ముందు ముందు తేలాల్సి ఉంది.

Related Posts