YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నల్లారితో షో పై విశ్లేషణలు.....

నల్లారితో షో పై విశ్లేషణలు.....

హైదరాబాద్, నవంబర్ 22, 
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన జరగక ముందు ఆయన సీఎంగా ఉన్నారు. తర్వాత జై సమైక్యాంధ్ర పెట్టారు. ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ ఏపీలో పర్యటించిన సమయంలో అటు వైపు కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చూడలేదు. అంటే ఆ పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది ఎవరికీ అర్థంకాని ప్రశ్న.కాంగ్రెస్ లో ఉండాలని అనుకుంటే, ఆ పార్టీలో యాక్టివ్ గా పనిచేయాలనుకుంటే రాహుల్ పాదయాత్రకు ఖచ్చితంగా వచ్చి ఉండేవారు. కానీ ఆయనకు ఆ ఆలోచన లేనట్లే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరో దశాబ్దకాలం పాటు లైఫ్ లేదని ఆయన భావించి ఉండవచ్చు. అనసరంగా శ్రమ తీసుకోవడం, కొందరికి శత్రువులుగా మారడం ఆయనకు ఇష్టం లేదు కాబోలు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా లేరు. అప్పుడెప్పుడో ఢిల్లీకి వెళ్లి సోనియాతో సమావేశమయినప్పుడు ఆయన యాక్టివ్ అవుతారని భావించినప్పటికీ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.నల్లారి కిరణ‌్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇద్దరు ప్రధాన శత్రువులున్నారు. వారిలో చంద్రబాబు ఒకరయితే, మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే వైఎస్ మరణం తర్వాత ప్రధాన శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మాత్రమే చెప్పాలి. పెద్దిరెడ్డి తో వైరం చంద్రబాబుతో ఆ కుటుంబానికి సయోధ్య కుదిర్చిందంటారు. చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు నల్లారి కుటుంబం శాసించేది. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబమే పెద్దన్నగా వ్యవహరిస్తుంది. అందుకే తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. పెద్దిరెడ్డిని దెబ్బతీయడానికే తమ్ముడిని టీడీపీలోకి పంపారంటారు. తన సోదరుడికి అన్ని రకాలుగా సహకారం అందించినా గెలుపు దక్కలేదు. ఈసారైనా పెద్దిరెడ్డిని దెబ్బతీయాలన్న ప్లాన్ లో ఉన్నారు. తాజాగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటీటీ ప్లాట్ ఫాంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. తనకు, వైఎస్ కు మధ్య బేధాభిప్రాయలు సృష్టించింది ఒక మంత్రి అని నల్లారి వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ పెద్దిరెడ్డి ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు నల్లారి సన్నిహితులు. అప్పట్లో వైఎస్ హయాంలో నల్లారికి మంత్రి పదవి దక్కకుండా జగన్ వెంట నిలచి పెద్దిరెడ్డి అడ్డుకున్నారని కూడా చెబుతారు. రెండు కుటుంబాల మధ్య మరచిపోలేని వైరం కొనసాగుతుంది. జగన్ మాత్రం పెద్దిరెడ్డిని దగ్గరకు తీయడంతో మరింతగా పగ పెరిగిందంటారు. అందుకే వచ్చే ఎన్నికలలో పెద్దిరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు నల్లారి కిరణ్ తెరవెనక ఉండి అయినా ప్రయత్నిస్తారని ఆయన కామెంట్స్ వినపడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు క్లాస్‌మేట్స్. ఈ ఇద్దరితో బాలకృష్ణ ఓటీటీలో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను బతికి ఉండటం వల్లనే సీఎం అయ్యానని తెలిపారు. ఆరోజు వైఎస్ వెంట హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయినట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. తాను వెళ్లకపోవడం వల్లనే బతికిపోయాని, అందుకే సీఎం కాగలిగానని ఆయన వ్యాఖ్యానించారని ప్రోమోను బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద నల్లారి పగ ఇంకా చల్లారి నట్లు లేదు. పెద్దిరెడ్డిపై పగ తీర్చుకోవడానికి మరోసారి రెడీ అవుతున్నట్లే కనిపిస్తుంది.

Related Posts