YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుల పాలిట ధరణి శాపం

రైతుల పాలిట ధరణి శాపం

నిజామాబాద్, డిసెంబర్ 9, 
తెలంగాణా ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా తీసుకున్న రైతు శేయస్సు కోసం,ధరణివెబ్ సైట్ ను రూపొందించింది. కాని అధికారుల తప్పిదం వల్లనో సాంకేతిక లోపల వల్లనో కాని రైతుల పాలిట శాపంగా తయారైంది ధరణి.ఒక్కరి భూమి కనిపించడం లేదని,మరోక్కరు రైతు బందు ఇవ్వడం లేదని,ఇంకోక్కరు మాకు పట్టా పాస్ బుక్ ఇవ్వడం లేదని,ఈల చెప్పుకుంటూ పోతే సంతడంత చిట్టా ఉంటుంది రైతుల భాధలు ఉమ్మడి నిజామాబాద్  జిల్లాలోని వ్యవసాయ భూముల జాబితా తయారీలో అధికారుల తప్పిదం హక్కుదారుల పాలిట శాపంలా మారింది. ఏ మాత్రం సంబంధం లేకున్నా పలు భూములను అనుమతి లేని జాబితాలో చేర్చుతున్నారు మండల రెవెన్యు కార్యాలయంలో పని చేసే అధికారులు.దీంతో భూమి బదలాయింపు జరగట్లేదు.ఐతే భూములకు సంబందించిన రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదని, సబ్‌ రిజిస్ట్రార్‌ను సంప్రదిస్తే రెవెన్యూ అధికారులను కలవాలని దాటవేస్తున్నారు. ఫలితంగా పట్టాదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చిన సమయంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా విభజించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ల వద్ద ఉన్న అనుమతి లేని జాబితాను ధరణిలో నమోదు చేశారు. ఆసమయంలో చాలా వరకు పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది.నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌ సబ్‌ రిజిస్ట్రార్ల పరిధిలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది. నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోనే వందల్లో బాధితులు ఉన్నారు. నవీపేట్‌, నిజామాబాద్‌ రూరల్‌, డిచ్‌పల్లి, మాక్లూర్‌ పరిధిలోని వందలాది మంది రైతులు నిషేధిత జాబితాలోని తమ భూమిని మార్చుకొనేందుకు తహశీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం, నవీపేట్‌ మండలల్లో  రైతు తన అవసరాల కోసం పొలం విక్రయించడానికి ఎకరాకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తీరా రిజిస్ట్రేషన్‌ కోసం చేసుకుందామనే సమయంలో అనుమతి లేని జాబితాలో ఉన్నట్లు తెలిసింది. నెల రోజులుగా సమస్య తీరకపోవడంతో చివరగా ఒప్పందం రద్దు చేసుకొన్నాడు.ఐతే ఆ నిషేదిత భూముల నుండి తొలగించుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు.మరోవైపు నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించుకునేందుకు  భూమి హక్కుదారులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఇందుకోసం తమ సర్వే నంబరు పరిధిలోని హక్కుదారుల వివాదం స్టే ఉత్తర్వులు గానీ, ప్రభుత్వ భూమి కాదు అని ప్రత్యేకంగా చూపించాల్సి వస్తోంది. దీనికి రోజులు,సంవత్సరాల తరబడి సమయం పడుతోంది.ప్రభుత్వం లేదా కోర్టుపరంగా వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా పట్టా భూములను అనుమతి లేని జాబితాలో చేరుతున్నారు కొందరు అధికారులు.అసైన్డు భూములకు ప్రభుత్వం ప్రత్యేకంగా చిట్టా(22ఏ రిజిస్టరు)ను ఉంచింది. అయినప్పటికీ ఇందులో పొందుపర్చిన ప్రత్యేక ‘బై’(పార్ట్‌లీ) నంబర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక సర్వే నంబరులో ఉన్న బై నంబర్ల మొత్తాన్ని కూడా ధరణిలో అనుమతి లేని జాబితాలోకి చేర్చారు. ఐతే ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. నిషేధిత జాబితాను సవరించేందుకు తమకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయని స్థానికంగా ఉన్న ఓ మండల  తహసీల్దారు చెప్పుకొచ్చారు.ఓ గ్రామంలోని సర్వే నంబరులో మొత్తం ఆరెకరాల భూమి ఉంది. గతంలో రియల్టర్లు కొంతభూమిని నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. 2019లో ఈ భూమిలోని గుంట స్థలంపై వివాదం నడిచి కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం అధికారులు మొత్తం భూమిని నిషేధిత జాబితాలోకి మార్చారు. ఫలితంగా మిగతా భూమిపై హక్కుదారులు లావాదేవీలు చేసుకొనే వీలు లేకుండా పోయింది: 
అనుమతి లేని జాబితాలో భూమికి సంబంధించి దస్త్రాలు చూస్తున్నాం. ఇందులో భాగంగా సేత్వార్‌, వసూలు బాకీ, క్లాసర్‌ రిజిస్టర్‌, కాసుల పహాణీ పరిశీలిస్తున్నామని. సర్వే నంబర్‌లో ఉన్న భూమికి సంబంధించి పట్టా ఉందా లేక ప్రభుత్వ భూమా అనేది చూస్తున్నమని, అనుమానం ఉంటే తహసీల్దార్‌ క్షేత్రస్థాయిలో వెళ్లి చూస్తారు. తహసీల్దార్‌, ఆర్డీవోలతో వేసిన కమిటీ వాటిని పరిశీలించి కలెక్టర్‌కు నివేదిస్తారు. పాత రికార్డుల ప్రకారం పట్టా భూమి అని తేలితే.. ధరణిలో ప్రభుత్వ భూమి అని తొలగిస్తామని సంబందిత అధికారులు చెపుతున్నారు సామాన్య  ప్రజలకు కష్టాలు రాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ సైట్  లో ఉన్న పొరపాట్లను సరిదిద్ది అందరికి తమ భూమి అందే విధంగా జిల్లా అధికార యంత్రంగా చూడాలి కోరుకుందాం

Related Posts