YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముందుకు సాగని..బ్యాక్ వాటర్ పనులు

ముందుకు సాగని..బ్యాక్ వాటర్ పనులు

నల్గోండ, ఫిబ్రవరి 23,
కరవు పీడిత నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న దశాబ్ధాల కల ఇంకా కలగానే మిగిలిపోయింది. ఆ కలతీరడానికి ఉమ్మడి నల్గొండ రైతంగా ఇంకా ఎదురుచూపుల్లోనే గడుపుతోంది.శ్రీశైలం  బ్యాక్ వాటర్ ను వినియోగించుకుని నల్గొండ జిల్లాలో ప్రధానంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి అందించాల్సిన శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్ట్ పరిస్థితి ఒక అడుగు ముందుకు, వంద అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు, శంకుస్థాపనల చరిత్ర చాలా పాతది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదలైన సాగునీటి ప్రాజెక్టుల జలయజ్ఞం లో భాగంగా కార్యరూపం దాల్చింది.3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.1925కోట్ల అంచనాతో పనులు మొదలయ్యాయి. నిర్ణీత గడువు మేరకు ప్రాజెక్టు పనులు మొదలయ్యాక నాలుగేళ్లకు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది.2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ప్రభుత్వం పదేళ్లు పాలనలో ఉన్నా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టులో కాల్వలు తవ్వాల్సిన ప్రాంతమంతా నల్లమల రిజర్వు అటవీ ప్రాంతంలో ఉండడంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి ప్రతిబంధకంగా మారింది.శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు ముందుకు పడే అవకాశం కనిపించక పోవడంతో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోయడం ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ఉద్దేశంతో ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ /ఎ.కె.బి.ఆర్) ను మొదలు పెట్టి పూర్తి చేశారు.ఎ.ఎం.ఆర్.పిని పూర్తి చేసే నాటికి ఆసియా ఖండంలో అతి ఎత్తైన ఎత్తిపోతల పథకంగా దీనికి పేరు వచ్చింది. నిర్వహణా భారం కూడా ఎక్కువగా ఉండడంతో ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం ఒక్కటే పరిష్కారమని భావించారు. 1983లో ఎ.ఎం.ఆర్.పిని మొదలు పెడితే ఇరవై ఏళ్లు గడిచాక 2004లో ఎస్.ఎల్.బి.సి పనులు మొదలయ్యాయి.శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టును 2004లో చేపట్టినా ఇంకా పెండింగులోనే ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగం ద్వారా నీటిని తీసుకుని నల్గొండ జిల్లా పరిధిలోని చందంపేట మండలం తెల్దేవర్ పల్లి వద్ద నీటిని బయటకు పోయడానికి మొత్తంగా సుమారు 44 కిలోమీటర్ల (43.930కి.మీ) మేర సొరంగం తవ్వాల్సి వచ్చింది.వైపు ఇన్ లెట్ 13.9కి.మీ నిడివిలో, నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఔట్ లెట్ కు 20.4 కిమీటర్ల నిడివిలో సొరంగాలు తవ్వాలి. దీనికి కోసం కోట్లాది రూపాయలు వెచ్చింది. టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం)ను తెప్పించారు. ఇది రెండు సార్లు శ్రీశైలానికి భారీ వదలు వచ్చిన సమయంలో నీటిలో మునిగిపోయి మర్మమతులు గురైంది.అన్ని అడ్డంకులు అధిగమించినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్టు సంస్థ కూడా చేతులు ఎత్తేసింది. చివరకు ప్రాజెక్టు పనులకు వినియోగించే కరెంటు చార్జీలు కూడా భారీగా పేరుకుపోయి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కేవలం విద్యుత్తు బిల్లులకు రూ.59 కోట్ల బకాయిలు ఉన్నాయంటే ప్రభుత్వ చిత్తశుద్దిని అర్థం చేసుకోవచ్చని ఈ ప్రాంత రైతు ఉద్యమ నాయకులు పేర్కొంటున్నారు.ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టును రూ.1925 కోట్ల అంచనాతో మొదలు పెడితే.. అదిప్పుడు రూ.4,900కోట్లకు పెరిగింది. ఇప్పటి దాకా ప్రాజెక్టు కోసం రూ.2700 కోట్ల ఖర్చు చేశారు. మరో రూ.2200 కోట్ల నిధుల అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంపై శ్రద్ధ పెడుతున్నా.. కనీసం ఈ అయిదేళ్లలో పనులు పూర్తవుతాయా అన్న అనుమానాలు ఈ ప్రాంత రైతుల మదిని తొలుస్తోంది.

Related Posts