YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ పార్టీకీ ఏమైంది...

గులాబీ పార్టీకీ ఏమైంది...

హైదరాబాద్, మార్చి 21
తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్‌కు ఏమైంది..? లోక్‌సభ ఎన్నికల వేళ నేతల్లో జోష్‌ ఎందుకు తగ్గింది..? ఇప్పుడే హాట్‌ టాపిక్‌ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల వేళ నేతల్లో జోష్‌ ఎందుకు తగ్గింది. ఇప్పుడే హాట్‌ టాపిక్‌ అయ్యింది. 24 ఏళ్ల భారత రాష్ట్ర సమితికి అన్ని వైపులా ఎదురు దెబ్బలే కనిపిస్తున్నాయట.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తామని.. అందుకు తగ్గుట్లుగా వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తోంది. అయితే బీఆర్ఎస్‌ పార్టీలో మాత్రం ఆ జోష్‌ కనిపించట్లేదు. ఇప్పటివరకు 11 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు. 14 ఏళ్ల ఉద్యమం, పదేళ్ల అధికారం… ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు, పోలీసులు ఎంత నిర్బంధం చేసిన ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన కేసీఆర్‌కు ప్రస్తుతం ఎప్పుడూ లేని కష్టాలు ఎదురవుతున్నాయి. 2014లో అధికారంలోకి రాగానే కారు డోర్లు బార్లా తెరిచారు కేసీఆర్. కెపాసిటీకి మించి వరదలా వలసలు వచ్చి పార్టీలో చేరిపోయాయి. ఇక 2018 ఎన్నికల తర్వాత రికార్డు మెజారిటీ సాధించిన మళ్లీ చేరికలను ప్రోత్సహించారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిన ప్రత్యర్థి, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో తిరుగులేని పార్టీ అంటూ ప్రచారం చేసుకుంది బీఆర్ఎస్.2019 పార్లమెంటు సీట్లలో కూడా 11 స్థానాలను గెలుపొందింది. మరోవైపు జాతీయ పార్టీగా మారెందుకు వ్యూహాలను రచించుకుంది. ఏకంగా పార్టీ పేరును కూడా మార్చుకున్నారు కేసీఆర్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. మొన్నటివరకు ఓవర్ క్రౌడ్ తో ఉన్న కారు ఖాళీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా కారు దిగి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఐదుగురు సెట్టింగ్ ఎంపీలు పార్టీని వేయడం బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి మారిపోయారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌తో సహా, నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే వరుసగా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా పార్టీని వీడే నేతల సంఖ్య పెరుగుతుందని అంచనాలు ఉన్నాయట.ఒకవైపు పార్టీ బలహీనపడుతుంటే మరోవైపు కేసుల పేరుతో మరో తలనొప్పి మొదలైంది కేసీఆర్‌కు. ఢిల్లీ లిక్కర్ కేసులో పార్టీ నేత, కూతురు కవితను అరెస్ట్ చేయడం మరో దెబ్బ. ఇంకోవైపు రాష్ట్రంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా ఎమ్మెల్యేలు, పలువురు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాలుగా దాడి చేస్తోంది. ఇది కూడా ఇబ్బందిగా మారిందట. గతంలో టికెట్ల కోసం పార్టీలో పోటాపోటీ ఉండేది. కానీ ఇప్పుడు టికెట్‌ ఇస్తామన్నా పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా లేరు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేంద్రం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. కానీ ఫీల్డ్‌లో మాత్రం పరిస్థితులు అనకూలంగా లేకపోవడంతో అభ్యర్థులు కూడా అంతగా ప్రచారంలో కనిపించట్లేదు

Related Posts