YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏప్రిల్ ఒకటిన ఏం జరగబోతోంది

ఏప్రిల్ ఒకటిన ఏం జరగబోతోంది

హైదరాబాద్, మార్చి 28
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దాంతో కవితను తీహార్ జైలుకి తరలించారు. కాగా, ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఏప్రిల్ 9న జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. మరి, కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అసలేం జరగనుంది?బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది కోర్టు. మరి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లేక ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్ బోయినపల్లి సహా పలువురికి బెయిల్ మంజూరైంది. అనారోగ్యం, కుటంబ కారణాలతో కొందరు.. అప్రూవర్ గా మారి మరికొందరు బెయిల్ తెచ్చుకున్నారు.కవిత మాత్రం తాను అప్రూవర్ గా మారను అన్నారు. న్యాయ పోరాటం చేస్తానన్నారు. దీంతో ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండగా.. ఈడీ కూడా దీనిపై వాదనలు వినిపించనుంది. ఇరుపక్షాల వాదనలపై ఆధారపడి కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనేది కోర్టు నిర్ణయిస్తుంది.ఈడీ ఇప్పటికే కవితను 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి కోరింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏ1 గా ఉన్నారు. కవిత ఏ2గా ఉన్నారు. కవితకు బెయిల్ ఇస్తే కీలకమైన ఆధారాలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈడీ భావిస్తోంది. సాక్ష్యులను ప్రభావం చేసే అవకాశం ఉందని.. కోర్టుకు రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అందుకే మరికొంత కాలం కస్టడీ కావాలని వాదనలు వినిపించింది ఈడీ.కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనేది విచారణ సమయంలో కేసు తీవ్రత, ఇరుపక్షాల వాదోపవాదాలపై ఆధారపడి ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంది? ఈ కేసులో నిందితులు కేసుపై ప్రభావం చూపే అవకాశం ఎంత? బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఆధారాలను ధ్వంసం చేసే చాన్స్ ఉందా? నిందితులు దేశం వదిలి వెళ్లే అవకాశం ఉందా? ఇలా పలు అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అవసరమైతే పాస్ పోర్టు కూడా సరెండర్ చేయించుకునే చాన్స్ ఉంది. ఏప్రిల్ 9న కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈలోపు వచ్చే నెల 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ట్రయల్ కోర్టులో కవితకు ఊరట లభించకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంది.

Related Posts