YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కమ్యూనిస్టు కోటలో పాగా ఎవరిది..

కమ్యూనిస్టు కోటలో పాగా ఎవరిది..

విజయవాడ, మార్చి 29
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పాటు చేయగా.. తొలుత కమ్యూనిస్టులు ప్రభావం చూపారు. ఆ తర్వాత కాంగ్రెస్కంచుకోటగా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు పాగా వేయగా....ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు.ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1955లో మైలవరం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా( వ్యాప్తంగా వామపక్షాల ప్రభావం అధికంగా ఉండటంతో...ఇక్కడ సైతం సీపీఐ పార్టీ అభ్యర్థి వెల్లంకి విశ్వేశ్వరరావు కేవలం 84 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పెడర్ల వెంకటసుబ్బయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1962 ఎన్నికల్లోనూ అదే అభ్యర్థులు పోటీపడగా..సీపీఐ ఈ సీటు నిలబెట్టుకుంది. అప్పుడు విశ్వేశ్వరరావు 514 ఓట్లతో  విజయం సాధించారు. 1967లో తొలిసారి కాంగ్రెస్ తరపున చనుమోలు వెంకట్రావుజయకేతనం ఎగురవేశారు. దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ సాధించారు....1972, 78లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.తెలుగుదేశం ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ప్రభావం చూపగా....ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ సత్యనారాయణ విజయం సాధించారు. 4వేల 200 ఓట్ల మెజార్టీతో చనుమోలు వెంకట్రావుపై గెలుపొందారు.  ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ చనుమోలు వెంకట్రావు  నిమ్మగడ్డ సత్యనారాయణను ఓడించారు.. 1989లో కోమటి భాస్కర్‌రావు కాంగ్రెస్‌ తరఫున....తెలుగుదేశం నుంచి జేష్ఠ రమేశ్‌బాబు పోటీపడగా...కాంగ్రెస్‌ను విజయం వరించింది. 1994 లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో మైలవరంలోనూ  ఆ పార్టీ అభ్యర్థి జేష్ఠ రమేష్‌ 7వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.1999లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుకు తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా...కాంగ్రెస్‌ నుంచి కోమటి సుబ్బారావుపై విజయం సాధించారు. 2004లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేయగా...ఆ పార్టీ సీనియర్  కాంగ్రెస్‌ నుంచి చనుమోలు వెంకట్రావు ఐదోసారి గెలుపొందారు. 2009లో తెలుుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీపడగా... కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌పై విజయం సాధించారు. నందిగామ ఎస్సీ రిజర్వ్‌డు కావడంతో దేవినేని ఉమ  మైలవరం నుంచి బరిలో దిగాల్సి వచ్చింది.రాష్ట్ర విభజన అనంతరం 2014లో వరుసగా రెండోసారి గెలిచిన దేవినేని ఉమ...చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడోసారి మైలవరం నుంచి దేవినేని ఉమ పోటీపడగా...గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా...ప్రస్తుతం మైలవరం టిక్కెట్‌ ఆయకే కేటాయించారు. వైసీపీ తరపున సరనాల తిరుపతిరావు యాదవ్‌ బరిలో దిగారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి వసంతపై తిరుపతిరావు యాదవ్‌ ఏ మేరకు నెట్టుకురాగలరో చూడాలి.మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలంలో కొంత భాగం మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. జనరల్ కేటగిరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు  2,80,000  మంది ఉన్నారు.

Related Posts