YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

14 సీట్ల కోసం 14 నుంచి రేవంత్ ప్రచారం

14 సీట్ల కోసం 14 నుంచి రేవంత్ ప్రచారం

హైదరాబాద్, ఏప్రిల్ 12
పార్లమెంట్ ఎన్నిక‌ల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా బ‌హిరంగ స‌భ‌లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే ముందుగానే..ఎన్నిక‌ల ప్రచారం రంగంలోకి దిగ‌తున్నారు. ప్రతిప‌క్షాల‌ను డిఫెన్స్‌లో పడేసేలా…ప్రచార ప్రణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు రేవంత్ రెడ్డి.వ‌చ్చే నెల 13న తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నిక‌ల ప్రచారానికి తెర‌లేప‌నున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో మూడుకు త‌గ్గకుండా బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్‌లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం రేవంత్.ఇప్పడికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో బీఆర్ఎస్, బీజేపీ నేత‌ల‌ను హ‌స్తం గూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్‌ పార్టీలో కీల‌కంగా ఉన్న నేత‌ల‌ను లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌లోకి రాకపోయినా.. బీఆర్ఎస్‌లో సైలెంట్‌గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు రేవంత్ రెడ్డి.ప్రతి పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా ఫోక‌స్ చేస్తూ.. కొత్త, పాత నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రచారంలో వంద రోజుల పాల‌నను ప్రజ‌ల్లో తీసుకెళ్తూనే… ప‌దేళ్ల బీఆర్ఎస్, బీజేపీ వైఫ‌ల్యాల‌ను వివ‌రించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పడికే ప్రతి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక స‌మ‌న్వయ క‌ర్తను నియ‌మించారు. వాళ్లు హైద‌రాబాద్, ఢిల్లీలోని వార్ రూమ్‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ ఎప్పటిక‌ప్పుడు అభ్యర్థి గెలుపుపై స‌ర్వేల‌ను అంద‌చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

Related Posts