YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హంతకులను కాపాడుతున్న సీఎం జగన్

హంతకులను కాపాడుతున్న సీఎం జగన్

కడప
కడప జిల్లాలో ఏపీసీసీ  చీఫ్ & కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.  వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి కుడా ప్రచారంలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ న్యాయం ఒకవైపు ..అధర్మం ఒకవైపు. ధర్మ పోరాటం ఒకవైపు...డబ్బు,అధికారం ఒకవైపు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా ? హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తరా? ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. వివేకా ను కిరాతకంగా నరికి చంపారు. - గొడ్డలి పోట్ల కు బలయ్యాడు.  వివేకా చనిపోయి 5 ఏళ్లు దాటింది.  ఇవ్వాళ్టి వరకు హంతకులకు శిక్ష పడలేదు.  వివేకా ఆత్మ ఇవ్వాళ్టికి ఘోషిస్తుంది.  హత్య చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని సిబిఐ  చెప్పింది.  హత్య కు కారణాలను ఆధారాలతో చూపించింది.  లావాదేవీలు ,ఫోన్ రికార్డులు అన్ని ఉన్నాయని చెప్పింది.  అయినా ఇవ్వాళ్టి వరకు హంతకులకు శిక్ష పడలేదు.  స్వయంగా జగన్ మోహన్ రెడ్డి హంతకులను కాపాడుతున్నారు.  అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారు.  సొంత చిన్నాన్న ను చంపిన దోషులను రక్షించడానికా అధికారం ఇచ్చింది ?  ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదు. అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నాడు.  ఈ అన్యాయం తట్టుకోలేక నే... వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుంది.  అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీ గా నిలబడ్డా. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి.  ఒకవైపు న్యాయం...ఆ వైపు అధర్మం.  ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా ? అన్యాయాన్ని ఎదురిస్తారా ?   నేను వైఎస్ఆర్ బిడ్డను.  చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించ లేక పోయా.  అందుకే ఎంపీ గా పోటీలో నిలబడ్డా.  నేను వైఎస్ఆర్ బిడ్డ...పులి కడుపున పులే పడుతుందని అన్నారు.
సునీతా రెడ్డి మాట్లాడుతూ  మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు?  మీకోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు.  మనం న్యాయం వైపు ఉన్నామా ? అన్యాయం వైపు ఉన్నామా ?  ప్రజలు ఆలోచన చేయాలి. తప్పు చేసిన వాళ్ళే భయపడతారు.  తప్పు చేయకుంటే బయం ఎందుకు ?  ధర్మం వైపు షర్మిల నిలబడింది.  ధర్మం వైపు నిలబడే షర్మిలను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు.

Related Posts