YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాధాకిషన్ కన్ఫెక్షన్ రిపోర్టు లో కీలక అంశాలు

రాధాకిషన్ కన్ఫెక్షన్ రిపోర్టు లో కీలక అంశాలు

హైదరాబాద్
రాధా కిషన్ కన్ఫెక్షన్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటపడ్డాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధా కిషన్ వ్యవహరించినట్లుగా గుర్తించారు.  తన చిన్ననాటి  మిత్రుడు అయినా ఎమ్మెల్సీ  వెంకట్రామిరెడ్డికి రాధాకిషనప్ పూర్తిస్థాయిలో సహాయం చేసాడు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి డబ్బులను పంపిణీ చేసాడు. టాస్క్ ఫోర్స్  వాహనాల్లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇచ్చిన డబ్బులు తరలించాడు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఎస్సై ని ఉపయోగించి డబ్బులను రాధా కిషన్ పంపినట్లు సమాచారం.తెల్లాపూర్ లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ లో వెంకట్రాంరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివ చరణ్ రెడ్డి వద్దకు సదరు ఎస్సై  డబ్బు తీసుకెళ్లాడు. రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు డబ్బుల రవాణాలో కీలక పాత్ర పోషించాడని గుర్తించారు.
డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ పు పోలీసులు  రికార్డ్ చేసారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకుల పై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటయింది. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్ కి  రాధా కిషన్ చేరవేసాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై రాధా కిషన్ నిఘా పెట్టాడు. రాధా కిషన్ కి సహకరించిన ఎస్సైలు ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను  పోలీసులువిచారించనున్నారు.

Related Posts