YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ మంత్రి పొన్నం ప్రభాకర్

బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్
బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి. వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చాం. బలహీన వర్గాలు ఆలోచించండి ... ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడండి. బీజేపీ లోక్ సభ ఎన్నికలకు కోసం 14 అంశాలతో మేనిఫెస్టో ని ప్రకటించింది. బలహీన వర్గాల ప్రధాన మంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయమని అన్నారు.
ఇది దేశంలో ఉన్నా బలహీన వర్గాలంతా గమనించాలని కోరుతున్న. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. కాని బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం  కాని ..లబ్ది కాని జరిగే నిర్ణయం తీసుకొనటువంటి ప్రధాని పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయాలి. కుల గణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటె ..దానికి సంబంధించి పాంచ్ న్యాయ్ లోపల ఒక అంశంగా పెట్టింది. గతంలోనే ఆ అంశాలను వ్యతిరేకించే వ్యాపార వర్గాల భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చి కుల గణన కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి ఆలోచన చేయండి.. ఎంత బీసీ లు ,ఎస్సీలు , ఎస్టీలు , మైనార్టీలు ,ఎంత ధనిక వర్గాకు ఉన్నారో తెలిస్తే వాళ్ళకి అంత న్యాయం చెయవచ్చని సమాజిక స్పృహ తో కాంగ్రెస్ పార్టీ ఉంటే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా నరేంద్ర మోడీ  బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ని..కాంగ్రెస్ మేనిఫెస్టో ని బీసీ లు చదివి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా కోరుతున్న. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  కుల గణన సర్వే చేస్తుంది ..అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్ లో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మీ బిడ్డ మీ పక్షానా నిల్చుంటాడు.ఎన్నికల్లో  బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టో ని చదివి..వారి బలహీన వర్గాల పట్ల ఉన్న వ్యతిరేకత ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని కోరుతున్నానని అన్నారు.

Related Posts