YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు నిషేధం

నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు నిషేధం

ఖమ్మం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వీపి గౌతమ్ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి నామినేషన్ లపై సూచనలు, సలహాలు ఇచ్చాం. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు నిషేధం, 100 మీటర్ల లోపలికి మూడు వాహనాలు అనుమతి వుంటుంది. నామినేషన్ పద్ధతి చట్టంలో ఉన్నట్లుగానే పొందు పరచాలి, కొత్త పద్ధతి కూడా వచ్చింది గమనించి దానిని పొందు పరచాలి. నామినేషన్ లో కొంచెం తప్పులు దొర్లినా వారి నామినేషన్ రిజెక్షన్ కు గురవుతుంది. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఉంటారు. నామినేషన్ సరిగా పొందుపరచని వారికి, సరిగా పొందు పరచలేదని సూచిస్తాం. ఇండిపెండెంట్ అభ్యర్థులకు 10 మంది మద్దతు దారులు ఉండాలి, వారిని మొదట 5 మంది తర్వాత ఐదుగురితో నాకు ప్రోఫోస్ చేయాలి. ఈ నెల 25న నామినేషన్ చివరి రోజు, 26న స్కృూట్నింగ్, 28న ఆదివారం సెలవు దినం, 29న  విత్డ్రాల్, మే 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు. నామినేషన్ దాఖలు చేసేందుకు 7 రోజులు సమయం ఉంది, చివరి రోజు జనరల్ అబ్జర్వర్ ఉంటుంది. చివరి నిమిషం వరకు నామినేషన్ దాఖలు చేయకుండా ఉండకండి. ఈసి చెప్పేది ఒక్కటే చిన్న విషయాలకు నామినేషన్ రిజెక్ట్ చేయకూడదు. అఫీడఫిట్ లో ఫాల్స్ సమాచారం ఇచ్చిన ఆ నామినేషన్ రిజెక్ట్ చేసే అవకాశం లేదు, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతై నామినేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుంది, గేట్ వరకు ర్యాలీలు వంటి వాటికి అనుమతి ఉంటుంది. జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు చెక్ పోస్ట్ లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో గొడవలు, డబ్బు పంచిన మాకు సమాచారం ఇవ్వండి వారిపై మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు మద్యం ఎక్కువగానే పట్టుకున్నామని వెల్లడించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో ఈ నెల 18 న నామినేషన్ పత్రాలు తీసుకుంటాం. చివరి తేదీ ఏప్రిల్ 25 న ఉంటుంది. మధ్యలో ఈ నెల 21 సెలవు దినం ఉంటుంది. ఈ సమయంలో మాత్రమే నామినేషన్ పత్రాలు స్వికరిస్తాం, మిగతా రోజుల్లో నామినేషన్ పత్రాలు తీసుకోవడం కుదరదు. నామినేషన్ పత్రాలపై స్కృూట్నింగ్ చేస్తాం, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని అందులో తేలుతుంది. మే 13న ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఎన్నికలు జరిగిన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకు ఈవిఎం లను భద్రపరుస్తాం. నామినేషన్ విషయంలో హెల్ప్ డెస్క్ కూడ ఏర్పాటు చేశాం. అభ్యర్థి ఎవరు ఉంటారో వారికి ఒక నిర్ణీత నగదు మాత్రమే ఖర్చు చేయాలి, నామినేషన్ దాఖలు చేసే ముందు రోజు అభ్యర్థి బ్యాంక్ అకౌంట్ తెరవాలి. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తులు 25 వేల రూపాయలు నగదు డిపాజిట్ చేయాలి, ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఓటు కలిగి ఉండాలి, వారికి ఎలక్టోరోల్ సర్టిఫికేట్ ఉండాలని అన్నారు.

Related Posts