YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19
లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.
శుక్రవారం సమీకృత కలెక్టరు కార్యాలయపు సమావేశపు హాలులో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణ ప్రక్రియపై పాత్రికేయుల  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిందనీ ఏప్రిల్ 18  నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందిని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4 న ఓట్లు లెక్కింపు పక్రియ   జరుగుతుందని అన్నారు.  
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల ప్రవర్తనా ఉల్లంఘన జరిగితే నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చనలని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు చేయడానికి అవకాశం ఉందని అన్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు జారీ చేస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, సువిధ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు, ప్రచారం నిర్బహించడానికి అనుమతి   లేదని అన్నారు.
రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణకు నియమించిన టీములు నిరంతర పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. చెక్ పోస్ట్ లు వద్ద పటిష్ట నిఘా ఉండాలని,  వాహనాలు తనిఖీ చేయాలన్నారు.  ఎన్నికల సంగం మార్గదర్శకాల మేరకు 50 వేల కంటే నగదు తీసుకెళ్తే తగిన ఆధారాలు చూపాలని, ఆధారాలు చూపకుంటే నగదు సీజ్ చేస్తామని, తదుపరి ఆధారాలు చూపిన పిదప విడుదల చేస్తామన్నారు.
ఎన్నికలలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున  ఫిర్యాదు చేసేందుకు
గ్రామ స్థాయిలో సి విజిల్ యాప్ పై  అవగాహన కల్పించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో సి - విజిల్ సంబంధించిన పోస్టర్లను ఏర్పాటుతో పాటు ఎంపిడివో  అధికారులు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
సి-విజల్ యాప్ లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాలలో టీము విచారణ నిర్వహిస్తుందని, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపణ జరిగితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
రాజకీయ పార్టీల నాయకులు విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో తమ పేరును ప్రతి ఒక్కరు పరిశీలన  చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఆన్లైన్ ద్వారా కానీ  దరఖాస్తు రూపంలో కానీ చేసుకోవాలని, నూతన ఓటరు నమోదుకు  దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

3500 అప్లికేషన్స్ ఫామ్స్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రావడం జరిగిందని ఎవరైనా ఉద్యోగులు తమ స్వంత జిల్లాకి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే వారికి ఒక రోజు ప్రత్యేక సెలవు మంజూరు చేయడం జరుగుతుందని 13వ తేదీన పోలింగ్ ఉన్నందున మే 3వ తేదీ నుండి వారం రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఫామ్ 12 డి ద్వారా 85 సంవత్సరాల దాటిన వయో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు  ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు ఓటు ఫర్ హోం ద్వారా అవకాశం కల్పించడం జరుగుతుందని ఫామ్ 12డి  స్థానిక బిఎల్ఓ ల  ద్వారా బిఎల్ఓ సూపర్వైజర్ల ద్వారా పొందవచ్చని తెలిపారు.  జిల్లాలోని 317 పోలింగ్ కేంద్రాల్లో  ఎన్నికల కమిషన్ ద్వారా అనుమతి పొంది
ఒకే చోట ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో 14 పోలింగ్ కేంద్రాలను మరోచోటికి తరలించడం జరిగింది అని 3 పోలింగ్ స్టేషన్లకు పేర్లు మార్చడం జరిగిందని తెలిపారు.  
అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో రెండవ విడత ఈవీఎంల ర్యాన్డమైజేషన్ పూర్తి చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
 ఇప్పటికే మూడు ఎఫ్.ఎస్.టీ టీం లను ఏర్పాటుచేసి మద్యం, నగదు, ఇతరత్రా వస్తువులు, రాజకీయ పార్టీల సమావేశాలు పై నిఘా ఉంచడం జరిగిందని ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ
సీజ్ చేసిన డబ్బును ఇతరత్రా వస్తువులను గ్రీవెన్స్ కమిటీ టీము ద్వారా ఆధారాలను పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా ప్రతి బుధవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి  పోలింగ్ ప్రక్రియకు సంబంధించి  సమస్యలను తెలుసుకోవడంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఫామ్ 6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 2 వేల మందికి ఎన్నికల గుర్తింపు  కార్డులు అందించడం జరుగుతుందని,  గత పార్లమెంట్ ఎన్నికల్లో 65 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని ఈ సారి ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామని, ఓటింగ్ తక్కువ జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్వీప్ కార్యక్రమాలు, డిపిఆర్వో టీము ద్వారా కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, నిక్కచ్చిగా  వినియోగించుకోవాలని అన్నారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్  ఓటింగ్ జరగడమే మన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Related Posts