YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పండుగ వాతావరణం లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్

పండుగ వాతావరణం లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్

పుంగనూరు
పుంగనూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్దిగా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్  కార్యక్రామానికి సుమారు 40 వేల మంది  తరలివచ్చారు. పుంగనూరు రోడ్లు జనసంద్రంగా మారిరాయి. ముందుగా పుంగనూరు హనుమంతరాయదిన్నే లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి కుటుంబసమేతంగా మంత్రి  దర్శించుకున్నారు. తరువాత భారీ ర్యాలితో వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేను పుంగనూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నన్ను ఇక్కడ అభ్యర్ధిగా మరోమారు నిలబెట్టారు. పుంగనూరు నియోజకవర్గం ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. సిఎం  వైయస్ జగన్ సహకారంతో 30 ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామని అన్నారు.
ఇచ్చిన మాట తప్పకుండా సిఎం శ్రీ వైఎస్ జగన్ అన్ని ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారు. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కబళించినా ఎక్కడా పథకాలు ఆపలేదు. మరోపక్క చంద్రబాబు నాయుడు గతంలో 600 హామీలు ఇచ్చి అన్ని విస్మరించారు. చెప్పిన మాట పై నిలబడే మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని అన్నారు.
టిడిపి అభ్యర్థి పై మాట్లాడుతూ పుంగనూరు లో టిడిపి తరపున నిలబడిన వ్యక్తి అల్లర్లకు కారకుడు. గతంలో పుంగనూరు బైపాస్ లో చంద్రబాబు రోడ్ షో కి పర్మిషన్ తీసుకున్నారు. ఉన్నట్టుండి పుంగనూరు టౌన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి తీసుకోలేదని అడ్డుకున్న పోలీసులు పై రౌడీయిజం చేసి దాడికి దిగారు. ఆ ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన కంటిని కోల్పోయారు. పోలీసులు పై దాడి చేస్తే, అరెస్ట్ చేయకుండా, జైలుకు పంపకుండా ఉంటారా?  మళ్ళీ నేను జైలుకు పంపాను అని తప్పుడు విమర్శలు చేసిన వ్యక్తి చల్లా రామచంద్రా రెడ్డి. అలాంటి వ్యక్తిని నేడు చంద్రబాబు ఇక్కడ తమ అభ్యర్ధిగా నిలబెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి  పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్ళకే మొక్కలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాను అని అబద్ధాలు చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. అయన మరణం అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంభానికి వెన్నుపోటు పొడిచాడు.  వైఎస్ జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా ? జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజన కు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్ళు పట్టుకున్నారు. చిదంబరం కాళ్ళు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజులపాటు అయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచారు. ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పి అక్కడ సంపద దోచుకుంది నిజం కాదా ?. నేను పుట్టింది తెలంగాణలో, నేను కూడా తెలంగాణ వాడినే అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆఖరి బాల్ నాదే అని చెప్పి ఏపి ప్రజల్ని మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. వాళ్ళ సొంత తమ్ముడే అయన్ని ఇక్కడ నుండి తరిమేశారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, నేడు బిజెపి టికెట్ పై పోటీ చేయడానికి సిగ్గు ఉండాలి. సమైక్యాంధ్ర పార్టీ పెట్టీ మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడు. ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలి. నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు కానీ, ఎంపిగా మిథున్ రెడ్డి  భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారరి అన్నారు.

Related Posts