YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సలహాదారుల రాజీనామాలేనా

సలహాదారుల రాజీనామాలేనా

విజయవాడ, ఏప్రిల్ 20,
ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.   ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వివరించింది. ఈ మేరకు ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.  నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మామూలుగా అయితే ఈ ఉత్తర్వులు పెద్ద సమస్య అయ్యేది కాదు కానీ..  వైసీపీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సలహాదారే. ఆయన రాజీనామా చేస్తే రాజకీయాలు  చేయలేరు. కానీ రాజీనామా  చేస్తే.. ఆయనకు ప్రభుత్వంలో పట్టు పోతుంది. ఆయన మాట వినరు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిధులను జీతాలుగా తీసుకుంటూ కొందరు ప్రభుత్వ సలహాదారులు రాజకీయ సభలు, సమావేశాలకు హాజరు కావడమే కాకుండా ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడాన్ని సవాల్‌ చేస్తూ ప్రతిపక్ష కూటమి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల నిబంధలన మేరకు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకొంటూ సలహాదారులుగా వ్యహరిస్తున్న వారు రాజకీయాలను మాట్లాడేందుకు వీల్లేదని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు కానీ, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న నాయకులు కానీ మాట్లాడేందుకు అవకాశం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా వాటిని తిప్పి కొట్టేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. సీఎం సూచన, సలహా మేరకు ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఉంటారు. సీఎం జగన్ ఎప్పుడూ మీడియా ముందుకు రారు. ఆయన బదులు ప్రభుత్వ ముఖ్య సలహాదారే మాట్లాడుతూ ఉంటారు.  ముఖ్యమంత్రి ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఏ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారో ఆ విషయాలను మీడియా ద్వారా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించే వారు.  ఎన్నికల కమిషన్‌ నిబంధనలతో ప్రతిపక్షాలను విమర్శించే అవకాశం సజ్జల రామకృష్ణారెడ్డికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే రాజీనామా చేయాల్సి ఉంది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అదే బాటలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా రాజకీయం చేస్తారని నఅనుకుంటున్నారు.   పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయననుషాడో సీఎం అని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్రలో ఉంటే.. వ్యవహారాలన్నీ ఆయనే చక్క  బెడుతున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో  రాజకీయ వ్యూహాలు ఆయన చేస్తున్నారు. ఆయన ముఖ్య సలహాదారుగా ఉండబట్టే.. ప్రభుత్వంలోని కీలక విభాగాల అధికారులు ఆయన ఆదేశాలను  పాటిస్తున్నారని చెబుతన్నారు. ఇలాంటి సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తే.. అధికార యంత్రాంగంపై గ్రిప్ పోతుందన్న ఆందోళనలో వైసీపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  చిట్ చాట్  ద్వారా మీడియాతో మాట్లాడి.. సలహాదారుగా మాత్రం కొనసాగాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నారు. తాను చేసే రాజకీయం అంతా తెర వెనుకే ఉంటుంది కాబట్టి తెర ముందుకు రావాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. రాజీనామా చేసినా  తెర వెనుక రాజకీయం.. కొన్ని ప్రెస్మీట్లు తప్ప చేసేదేమీ ఉండదని చెబుతున్నారు. అందుకే సలహాదారుగా కొనసాగుతూ.. మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వ్యవహారాలపై ప్రతిపక్షాలు మరోసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

Related Posts